కాగజ్‌నగర్‌ నుంచి హౌరాకు రైలు నడిపించాలి | - | Sakshi
Sakshi News home page

కాగజ్‌నగర్‌ నుంచి హౌరాకు రైలు నడిపించాలి

Jul 12 2026 3:11 AM | Updated on Jul 12 2026 3:11 AM

కాగజ్‌నగర్‌టౌన్‌: కాగజ్‌నగర్‌ నుంచి హౌరా కు ప్రత్యేక రైలు నడిపించాలని కోరుతూ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు శనివారం కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌కు వినతిపత్రం అందజేశారు. హైదరాబాద్‌కు వచ్చిన మంత్రి ని ఎమ్మెల్యే మర్యాద పూర్వకంగా కలిసారు. సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ నుంచి హౌరాకు ప్రత్యేక రైలు ప్రారంభిస్తే ఈ ప్రాంతంలో ఉంటున్న బెంగాళీలు కలకత్తా వెళ్లేందుకు సులువుగా ఉంటుందన్నారు. సికింద్రాబాద్‌, నాగ్‌పూర్‌ వందేభారత్‌ రైలులో అదనంగా బోగీలను పెంచాలని, సిర్పూర్‌ టౌన్‌ రైల్వే స్టేషన్‌లో పలు రైళ్లకు హాల్టింగ్‌ కల్పించాలని కోరారు. సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి చర్యలు చేపడుతామని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement