కెరమెరి: మండలంలోని కెస్లాగూడ గ్రామ పంచాయతీలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బీజేపీ నాయకులు శని వారం ఎంపీ గోడం నగేష్‌ను కోరారు. శనివా రం ఆదిలాబాద్‌లోని ఎంపీ నివాసంలో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చన్నుగూడలో ఎంపీజన్‌మన్ ద్వారా మంజూరైన ఇంటిని త్వరగా ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మండల కేంద్రం నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ గ్రామానికి రహదారి సౌకర్యం లేదన్నారు. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు. బీటీ రోడ్డు మంజూరు చేయాలని, కెస్లాగూడ(ఏ)రహదారికి బీటీ వేసేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని, డ్రెయినేజీల నిర్మాణాని కి నిధులు మంజూరు చేయాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోవ విజయ్‌కుమార్, జిల్లా ఉపాధ్యక్షుడు బానోత్ వెంకట్‌రావు, కెరమెరి మండలాధ్యక్షుడు సెడ్మకి తుకారాం పాల్గొన్నారు.


