● ఆర్కే న్యూటెక్‌కు అరుదైన ఘనత | - | Sakshi
Sakshi News home page

● ఆర్కే న్యూటెక్‌కు అరుదైన ఘనత

Jul 12 2026 3:11 AM | Updated on Jul 12 2026 3:11 AM

● ఆర్కే న్యూటెక్‌కు అరుదైన ఘనత ● జాతీయ స్థాయిలో మొదటి స్థానం ● రెండోసారి కూడా ‘ఫైవ్‌స్టార్‌’ సొంతం ● కై రిగూడ, ఆర్కే6 గనులకూ రేటింగ్‌ ● అధికారులు, కార్మికుల్లో హర్షాతిరేకాలు

శ్రీరాంపూర్‌: శ్రీరాంపూర్‌ ఏరియాలోని ఆర్కే న్యూటెక్‌ గని జాతీయ స్థాయిలో మెరిిసింది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఫైవ్‌స్టార్‌ రేటింగ్‌ సాధించింది. ఈ రేటింగ్‌ సాధించిన గనుల్లో మొదటి స్థానంలో నిలిచి మరో ఘనత కూడా నమోదు చేసుకుంది. కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని కోల్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ ఏటా దేశ వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్‌ బొగ్గు గనుల్లోని ఉత్తమమైవాటిని ఎంపిక చేసి స్టార్‌ రేటింగ్‌ ఇస్తుంది. ఉత్పత్తి, రక్షణ చర్యలు, ఉద్యోగుల సంక్షేమ, పర్యావరణ పరిరక్షణ, సామాజిక బాఽధ్యత.. ఇలా ఏడు విభాగాల్లో 50 అంశాలను ప్రామాణికంగా తీసుకుని ఫైవ్‌స్టార్‌ రేటింగ్‌ ఇస్తారు. ఈసారి దేశ వ్యాప్తంగా 382 ఎంట్రీలు రాగా, 50 గనులకు ఫైవ్‌స్టార్‌ రేటింగ్‌ ఇచ్చారు. ఇందులో సింగరేణిలో ఐదు గనులు ఫైవ్‌స్టార్‌ రేటింగ్‌ సాధించాయి. వీటిలో శ్రీరాంపూర్‌ నుంచి ఆర్కే న్యూటెక్‌ గని, ఆర్కే 6 గని, బెల్లంపల్లి ఏరియాలోని కై రిగూడ ఓసీపీలున్నాయి. వీటిలో ఆర్కే 6గనిని బొగ్గు నిల్వలు అడుగంటడంతో గతేడాదే మూసివేశారు. ఇక కై రిగూడ ఓసీపీ 2024–25లో 37.5 లక్షల టన్నుల లక్ష్యాన్ని నూరు శాతం సాధించింది. ఆ సంవత్సరం ఒక్క ప్రమాదం కూడా సంభవించలేదు. సేఫ్టీ వీక్‌ పోటీల్లో ఆఫ్‌ లోడింగ్‌, ఫస్ట్‌ ఎయిడ్‌లో కంపెనీ లెవల్‌లో మొదటి స్థానం సాధించింది. ప్రస్తుతం ఈ ఓసీపీలో 680 మంది పర్మనెంట్‌ ఉద్యోగులు పని చేస్తుండగా ఓబీల్లో సుమారు వెయ్యిమంది కాంట్రాక్ట్‌ లేబర్‌ పని చేస్తున్నారు.

న్యూటెక్‌ అన్నింటిలో మేటే..

ఆర్కే న్యూటెక్‌ గని బొగ్గు ఉత్పత్తితో పాటు అన్ని రంగాల్లో మేటిగా నిలుస్తోంది. 2023–2024 సంవత్సరంలోనూ ఈ గనికి మొదటిసారి ఫైవ్‌స్టార్‌ రేటింగ్‌ లభించింది. ప్రస్తుతం రెండోసారి ఈ రేటింగ్‌ సాధించడంపై కార్మికులు, అధికారులు హర్షం వ్యక్తంజేస్తున్నారు. ఈసారి 100 మార్కులకు గాను 99 మార్కులు సాధించి ఫైవ్‌స్టార్‌ రేటింగ్‌ సాధించిన గనుల్లోనే నెంబర్‌వన్‌ గనిగా నిలిచింది. ఈ గని 2024–25లో 105శాతం బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని నమోదు చేసుకుంది. ప్రమాదాలను పరిశీలిస్తే.. ఫ్యాటల్స్‌, సీనియర్‌ యాక్సిండెంట్లు ఒక్కటి కూడా నమోదు కాలేదు. రక్షణలోనూ 2022–23 కంపెనీ లెవల్‌లో కేటగిరి–2లో ఓవరాల్‌ సెకండ్‌ ప్లేస్‌ సాధించింది. దీంతోపాటు బెస్ట్‌ ఎకో ఫ్రెండ్లీ గనిగా, బెస్ట్‌ మ్యాన్‌ రైడింగ్‌ చైర్‌ లిఫ్ట్‌ సిస్టం అవార్డును కూడా గతేడాది సాధించింది. 2025–26కు గాను ఎస్‌డీఎల్‌ సెక్షన్‌లో రోజువారీగా ఎస్‌డీఎల్‌ టార్గెట్‌ 133 టన్నులు ఉంటే 144 టన్నులు సాధించి గతేడాది కంపెనీలో రికార్డు నమోదు చేసుకుంది.

బెల్లంపల్లి: కై రిగూడ ఓపెన్‌ కాస్ట్‌గని

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement