మొలకెత్తని సోయా.. రైతుల ఆందోళన | - | Sakshi
Sakshi News home page

మొలకెత్తని సోయా.. రైతుల ఆందోళన

Jul 5 2026 2:48 AM | Updated on Jul 5 2026 2:48 AM

బజార్‌హత్నూర్‌: ఖరీఫ్‌లో చేలల్లో తేజశ్విని సోయా విత్తనాలు నాటగా మొలకెత్తలేదని, సదరు కంపెనీ చర్యలు తీసుకోవాలని మండల రైతులు కోరారు. స్థానిక తహసీల్దార్‌, వ్యవసాయశాఖ కార్యాలయాల వద్ద శనివారం ఆందోళన చేపట్టారు. తేజశ్విని సోయా విత్తనాలు మొలవక పలు మండలాలతోపాటు బజార్‌హత్నూర్‌ మండలంలోని వందలాది రైతులు నష్టపోయారని, ప్రభుత్వం సంబంధిత కంపెనీపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. కంపెనీ ద్వారా నష్టపరిహరం ఇప్పించాలని కోరారు. అనంతరం తహసీల్దార్‌ శ్యాంసుందర్‌, ఏఈవో సంతోష్‌లకు వినతిపత్రాలు అందజేశారు. రైతులు డుబ్బుల చంద్రశేఖర్‌, బొమ్మెడి సంజీవ్‌, ప్రభాకర్‌, సుకుమార్‌, తాండ్ర శ్రీనివాస్‌, భోజన్న, హరికృష్ణ, గాండ్ల లక్ష్మణ్‌, తోకల విఠల్‌, క్యాతం శివకుమార్‌ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement