పంటమార్పిడితో మేలు | - | Sakshi
Sakshi News home page

పంటమార్పిడితో మేలు

Jul 5 2026 2:48 AM | Updated on Jul 5 2026 2:48 AM

● భూసారం పెరిగే అవకాశం ● చీడపీడల నియంత్రణ ● వరివేసే పొలంలో ముందుగా పప్పుజాతి పైర్లు వేయడం వల్ల నేల సారవంతమవుతుంది. ● వేరుశనగలో ఆకుముడల నివారించడానికి పప్పు జాతికి చెందిన పైరుతో మార్పిడి చేయాలి. ● కంది, మిరప ఎండుతెగుల ని వారణకు జొన్న, మక్క పంటలతో మార్పిడి చేయాలి. ● కందిని జొన్న, మొక్కజొన్న, నువ్వులు పంటలతో మార్పిడి చేస్తే కాయతొలిచే పురుగుల ఉధృతి తగ్గుతుంది. ● నులిపురుగుల సమస్య అధికంగా ఉన్న ప్రాంతాల్లో వేరుశనగ, మిరప వంటి పైర్లు కొన్ని పంట కాలాలు తప్పనిసరిగా ఆపాలి. ● టమాట వంటి వేశాక మిరప వేయొద్దు. ● వరి, జొన్న, మొక్కజొన్న, సజ్జ పైర్లను పప్పుజాతి పెసర, మినుము, వేరుశనగ పైర్లతో పంట మార్పిడి చేయాలి.

లోకేశ్వరం: ఒక పంటను వరుసగా ఒకే పొలంలో పండించడం వల్ల భూసారం తగ్గుతుంది. చీడపీడలు వృద్ధి చెందడానికి అనుకూల వాతావరణం ఏ ర్పడుతుంది. పంటలకు హాని కలిగించే పురుగుల జీవితచక్రం అంతరాయం లేకుండా కొనసాగుతుంది. ఈ సమస్యను అధిగమించేందుకు పంట మార్పి డి చేయాలని జిల్లా వ్యవసాయాధికారి అంజిప్రసా ద్‌ సూచించారు. పంట మార్పిడితో అనేక ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు.

జిల్లాలో..

జిల్లాలో సారంగాపూర్‌, మామడ, దిలావర్‌పూర్‌, కుంటాల, కుభీర్‌, తానూరు, ముధోల్‌, బాసర మండలాల్లో రైతులు పంటలు మారుస్తున్నారు. కొన్ని మండలాల్లో ఎక్కువగా వరి మాత్రమే వేస్తున్నారు. వానాకాలం, యాసంగి సీజన్లలో భిన్నమైన పంట లు వేస్తే చీడపీడల తీవ్రతను తగ్గించవచ్చు. సాధారణంగా ఒక పంటను ఆశ్రయించే పురుగులు మరొ క పంటను ఆశ్రయించవు. పంట మార్పిడి చేసినప్పుడు పురుగుల జీవిత చక్రం ఛేదించబడుతుంది. వాటి వృద్ధికి ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. వేగంగా పెరిగే కొన్నిరకాల పురుగులను సులభంగా అదుపులో ఉంచవచ్చు.

ప్రయోజనాలు..

నీటి వసతులు ఉన్న ప్రాంతాల్లో ఎక్కువగా వరి, వాణిజ్య పంటలు వేస్తారు. వరి, వేరుశనగ, జొన్న, మొక్కజొన్న వంటివి నేల పైపొరలు, పత్తి, మిరప, కంది వంటి పంటలు లోపలి పొరల నుంచి పోషకాలు తీసుకుంటాయి. దీంతో క్రమంగా నేల భౌతిక లక్షణాలు, స్వభావం దెబ్బతింటాయి. ఈ పంటలకు చీడపీడలు ఆశించి తీవ్ర నష్టం కలిగిస్తాయి. పంట మార్పిడిలో ఆహార, వాణిజ్య పంటలు ఒకసారి, పప్పు జాతివి మరోసారి వేయాలి. అవసరమైనప్పుడు పశుగ్రాసం కోసం గడ్డిజాతి పంటలు, భూసారం పెంచడానికి పచ్చిరొట్ట వేసుకోవచ్చు. పప్పుజాతి పంటలతో మార్పిడి చేస్తే వాటి వేర్లు, బుడిపెలలోని రైజోబియం సూక్ష్మజీవులు గాలిలోని నత్రజనిని స్థిరీకరించి మొక్కలకు అందిస్తాయి.

పద్ధతులు ఇవి..

అంజిప్రసాద్‌, జిల్లా

వ్యవసాయాధికారి, నిర్మల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement