జై హరి విఠల.. | - | Sakshi
Sakshi News home page

జై హరి విఠల..

Jul 5 2026 2:48 AM | Updated on Jul 5 2026 2:48 AM

ప్రారంభమైన పండరిపూర్‌ పాదయాత్ర భక్తుల భజనలు, హరినామా సంకీర్తనలు పాల్గొన్న ముధోల్‌ ఎమ్మెల్యే రామారావు పటేల్‌

భైంసా: ఏటా ఆషాడ ఏకాదశి సందర్భంగా మహా రాష్ట్రలోని శ్రీ విఠల్‌–రుక్మిణి స్వామివారి దర్శనం కోసం భక్తులు నిర్వహించే పండరిపూర్‌ పాదయా త్ర ప్రారంభమైంది. ‘విఠల.. విఠల.. జై హరి విఠల‘ అనే నామస్మరణతో మార్మోగింది. భజనలు, హరి నామ సంకీర్తనలతో ఉత్సాహంగా అడుగులు వేశా రు. శనివారం భైంసా నుంచి ప్రారంభమైన పాదయాత్రలో ముధోల్‌ ఎమ్మెల్యే రామారావు పటేల్‌, ప్రజాట్రస్ట్‌ చైర్మన్‌ భోస్లే మోహన్‌రావు పటేల్‌ పాల్గొన్నారు. భక్తులతో కలిసి కాలినడకన శ్రీ విఠల్‌–రుక్మి ణి స్వామివారిని స్మరించుకుంటూ భజనలు చేశా రు. యాత్రికులకు అభివాదం చేస్తూ కొంతదూరం నడిచి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ముందుగా గీత కాటన్‌ మిల్లు నుంచి యాత్ర చేపట్టగా, పారిశ్రామికవేత్త నాగనాథ్‌ పటేల్‌ ప్రారంభించారు. ఎస్‌ఎస్‌ జి న్నింగ్‌ ఫ్యాక్టరీ వద్ద ఎమ్మెల్యే వారికి ఘన స్వాగతం పలికి భక్తులను సత్కరించారు. 20రోజుల పాటు పాదయాత్ర అనంతరం ఈనెల 24న ఆలయానికి చేరుకుంటారు. దర్శనం తర్వాత తిరిగివస్తారు.

శతాబ్దాల చరిత్ర

పండరిపూర్‌ పాదయాత్రకు శతాబ్దాల చరిత్ర ఉంది. మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్రలో వార్కరి సంప్రదాయానికి చెందిన భక్తులు తులసిమాలలు ధరించి, చేతిలో తాళాలు, మృదంగాలతో హరినామా సంకీర్తనలు చేస్తూ వందల కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించి పండరిపూర్‌లోని శ్రీ విఠల్‌–రుక్మిణి ఆలయానికి చేరుకుంటారు. ఆషాఢ ఏకాదశి సందర్భంగా జరిగే పాదయాత్ర దేశంలో ఒకటిగా గుర్తింపు పొందింది.

యాత్రలో వేలాది భక్తులు

తెలంగాణ సరిహద్దు ప్రాంతాలు, మహారాష్ట్రలోని అనేక జిల్లాల నుంచి ప్రతి ఏడాది వేలాది మంది భక్తులు ఈ యాత్రలో పాల్గొంటారు. కులమతాలకు అతీతంగా కుటుంబ సభ్యుల్లా కలిసి ప్రయాణించడం దీని ప్రత్యేకత. మార్గమధ్యలో గ్రామస్తులు అన్నదానం, తాగునీరు, విశ్రాంతి సదుపాయాలు కల్పిస్తూ సేవాభావాన్ని చాటుకుంటారు. భక్తి, సేవ, సమానత్వానికి ప్రతీకగా నిలిచిన పండరిపూర్‌ పాదయాత్రలో పాల్గొన్న భక్తులు శ్రీ పాండురంగ విఠల్‌ స్వామివారి ఆశీస్సులతో ప్రజలందరూ బాగుండాలని, పంటలు సమృద్ధిగా పండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రార్థిస్తూ యాత్రను కొనసాగిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement