జాగ్రత్తలే శ్రీరామరక్ష | - | Sakshi
Sakshi News home page

జాగ్రత్తలే శ్రీరామరక్ష

Jul 5 2026 2:48 AM | Updated on Jul 5 2026 2:48 AM

● వానాకాలంలో పశువులకు పొంచి ఉన్న వ్యాధులు ● ముందస్తు చర్యలు తప్పనిసరి

వర్షానికి తడిసేలా పశువులను కట్టివేస్తే వ్యాధులు సంక్రమిస్తాయి.

మే నెలలో గొంతు జబ్బవాపు టీకాలు ఇప్పించకపోతే ఈనెలలో ఇప్పించాలి.

పశువులు ఈ కాలంలో ఎదకు వస్తాయి. సాయంత్రం కృత్రిమ గర్భధారణ చేయించాలి.

నిల్వ చేసిన గడ్డి (సైలేజ్‌) ఉంటే వాడుకోవ చ్చు. అది వర్షానికి తపవకుండా చూసుకోవాలి.

వ్యాధి ప్రారంభంలో పెన్సిలిన్‌ ఆక్సివంటి యాంటీహిస్టమిక్స్‌ వాడాలి. కార్డిజోన్స్‌, డె క్ట్రోజ్‌ నార్మల్‌ సైలెన్‌ వాడాలి. వ్యాధి సోకిన పశువుల్ని మంద నుంచి వేరుచేయాలి.

మంచిర్యాలఅగ్రికల్చర్‌: వానాకాలం సీజన్‌ మొదలైంది. పశువులకు వివిధ వ్యాధులు సోకే ప్రమాదం ఉంది. తొలకరి నేపథ్యంలో పచ్చగా కొత్తగా మొలకెత్తిన గడ్డి తిని పశువులు, జీవాలు అనారోగ్యానికి గురువుతున్నాయి. గొంతు వాపు, జబ్బ వాపులు వ్యాధులు ప్రబలే సూచనలు కనిపిస్తున్నాయి. పాడి రైతులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని జిల్లా పశువు సంవర్థక శాఖ సంచాలకుడు యాకుబ్‌రెడ్డి వివరిస్తున్నారు. ఈ సమయంలో ఎక్కువగా అనారోగ్యానికి గురై మృత్యువాత పడుతుంటాయి. గొంతువాపును గురక వ్యాధి అని అంటారు. ఇవి బాక్టీరియా (సూక్ష్మజీవులు)వల్ల వ్యాప్తి చెందుతుంది. వ్యాధి సోకిన పశువు శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. కంటి నుంచి నీరు కారడం, నోటి నుంచి చొంగ పడడం.. గొంతు, మెడ వాపు లక్షణాలు కనిపిస్తాయి. వ్యాధి తీవ్రమైతే శ్వాస కష్టమై గురుక శబ్దంతో 24 గంటల్లో మరణిస్తుంది. వ్యాధి నివారణకు సల్పడిమిడిన్‌, ఇంటాసెఫ్‌ టాజు, ఎక్సెస్ట్‌ మొదలగు ఇంజక్షన్లు పనిచేస్తాయి. వ్యాధి తీవ్రతను బట్టి పశువైద్యులను సంప్రదించాలి సలహాలు తీసుకోవాలి.

గొంతు వాపు: త్వరగా వ్యాపించే అంటు వ్యాధి. ఇది సోకిన పశువులను విడిగా ఉంచాలి. మృతిచెందిన పశువుల కళబేరాన్ని లోతైన గొయ్యి తీసి పాతిపెట్టాలి.

జబ్బ వాపు: దీన్ని సొప్ప వాపు అంటారు. క్ట్యాస్టిడియం చొవై అనే బాక్టీరియా ద్వారా సోకుతుంది. ఆరు నెలల యుక్త వయస్సులో ఉండి ఆరోగ్యంగా, దృఢంగా ఉన్న పెయ్యలకు ఎక్కువగా సోకుతుంది. ఈ వ్యాధి కలుషితమైన గ్రానం, నీరు, గాయల ద్వారా వస్తుంది.

తీసుకోవాల్సి జాగ్రత్తలు..

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement