బాధ్యతగా విధులు నిర్వర్తించండి | - | Sakshi
Sakshi News home page

బాధ్యతగా విధులు నిర్వర్తించండి

Jul 5 2026 2:48 AM | Updated on Jul 5 2026 2:48 AM

● బాసర జోన్‌ డీఐజీ భాస్కరన్‌ ● నాలుగు జిల్లాల పోలీసు, అధికారులతో సమీక్ష

నిజామాబాద్‌అర్బన్‌: ప్రతి పోలీసు అధికారి బా ధ్యతాయుతంగా విధులు నిర్వర్తించి ప్రజల్లో మ రింత విశ్వాసాన్ని పెంపొందించాలని బాసర జో న్‌ డీఐజీ భాస్కరన్‌ సూచించారు. నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పేర్కొన్నా రు. నిజామాబాద్‌, నిర్మల్‌, జగిత్యాల, ఆదిలాబా ద్‌ జిల్లాల పోలీస్‌ అధికారులతో శనివారం జిల్లా కేంద్రంలోని పోలీస్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో సమావేశమయ్యారు. రేంజ్‌ పరిధిలోని జిల్లాల్లో శాంతి భ ద్రతలు, నేరాల నియంత్రణ, కేసుల దర్యాప్తు, మహిళలు, చిన్నారుల భద్రత, సైబర్‌ నేరాల ని యంత్రణ, ట్రాఫిక్‌ నిర్వహణ, మాదకద్రవ్యాల నిర్మూలన, కమ్యూనిటీ పోలీసింగ్‌ కార్యక్రమాల పై సమీక్షించారు. జిల్లాల వారీగా నమోదవుతు న్న నేరాల తీరు, విచారణలో పురోగతి, తీసుకుంటున్న చర్యలను తెలుసుకున్నారు. ప్రజల ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. సాంకేతిక పరిజ్ఞానంతో సైబర్‌ నేరాలను అరికట్టాలన్నారు. మహిళలు చిన్నారులపై జరిగే నేరాల కేసుల్లో వేగవంతమైన దర్యాప్తు చేపట్టాలన్నారు. రేంజ్‌ పరిధిలో ఎదురవుతున్న సమస్యలను పోలీసులు అధికారులు డీఐజీకి వివరించారు. సమావేశంలో నిజామాబాద్‌ సీపీ సాయి చైతన్య, నిర్మల్‌ ఎస్పీ జానకీ షర్మిల, ఆదిలాబాద్‌ ఎస్పీ అఖిల్‌ మహాజన్‌, జగిత్యాల ఎస్పీ అశోక్‌కుమార్‌, అదనపు ఎస్పీలు, ఏసీపీలు, సీఐలు రిజర్వ్‌ విభాగం అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement