ఎస్టీపీపీ భూ నిర్వాసితులకు న్యాయం చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఎస్టీపీపీ భూ నిర్వాసితులకు న్యాయం చేయాలి

Jul 5 2026 2:48 AM | Updated on Jul 5 2026 2:48 AM

జైపూర్‌: జైపూర్‌ ఎస్టీపీపీ భూ నిర్వాసితులకు శాశ్వత ఉద్యోగ అవకాశాలు కల్పించి న్యాయం చేయాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వెర్రబెల్లి రఘునాథ్‌రావు, జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్‌గౌడ్‌ కోరారు. హైదరాబాద్‌లో సింగరేణి భవన్‌లో కేంద్ర బొగ్గు గనులశాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డిని శనివారం కలిసి వినతిపత్రం అందజేశారు. కాంట్రాక్టు కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఎస్టీపీపీ ప్రభావిత గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేయాలని కోరగా ఆయన సానుకూలంగా స్పందించినట్లుగా వారు పేర్కొన్నారు. నాయకులు వెంకటకృష్ణ, దేవరనేని సంజీవరావు, సర్పంచ్‌ రామగిరి రాము తదితరులు ఉన్నారు.

హాజీపూర్‌లో సామాజిక తనిఖీ ప్రజావేదిక

మంచిర్యాలరూరల్‌(హాజీపూర్‌): హాజీపూర్‌ మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణలో శని వారం ఐదోవిడత ఉపాధిహామీ సామాజిక తనిఖీ ప్రజావేదికను నిర్వహించారు. మండల పరిధిలోని 12 గ్రామపంచాయతీల్లో ఈజీఎస్‌ కింద చేపట్టిన వివిధ పనులకు సంబంధించి ఎంబీ రికార్డులను సామాజిక తనిఖీ అధికారులకు ఇవ్వకపోవడంతో డీఆర్డీవో కిషన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. పడ్తనపల్లి లో సామాజిక తనిఖీ సిబ్బందికి రికార్డులను చూపించక పోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశా రు. మండలంలో రూ.1.45 కోట్లతో చేపట్టిన 212 పనులను బృందం సభ్యులు తనిఖీ చేపట్టారని తెలిపారు. గ్రామాభివృద్ధిలో భాగంగా చేపట్టే పనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఫిర్యాదుల అధికా రి శివరాం, విజిలెన్స్‌ మేనేజర్‌ కిరణ్‌, ఇన్‌చార్జి ఎంపీడీవో గౌతం, ఎంపీవో సుమన్‌, ఈజీఎస్‌ ఏపీవో మల్ల య్య, ఎస్సార్పీలు రాజశేఖర్‌, నా గరాజు, ఏపీఎం వెంకటేశ్‌, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement