
సమస్య పరిష్కారంలో అధికారులు విఫలం
కాగజ్‌నగర్‌టౌన్: పోడు భూముల సమస్యను సామరస్యంగా పరిష్కరించడంలో అటవీ అధికారులు విఫలమవుతున్నారని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు అన్నారు. ఆదివారం ఎమ్మెల్యే నివాసంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ అటవీ అధికారులు అత్యుత్సాహంతో పోడు రగడ జఠిలమైందన్నారు. పోడు రైతులను అడ్డుగా పెట్టుకొని ఫారెస్ట్ అధికారులు ఈ ప్రాంత ప్రజలపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. చింతలమానెపల్లి మండలం దిందా రైతులు 400 కిలోమీటర్ల పాదయాత్ర చేసి శామీర్‌పేట్‌కు చేరుకోగానే పోలీసులు అడ్డుకొని దొంగలు గా చిత్రీకరించడాన్ని ఖండిస్తున్నామని పేర్కొన్నా రు. దిందా, ఇటుకపహాడ్, డబ్బా, కొండపల్లి గ్రామాల్లో అధికారుల దౌర్జన్యాలు మితిమీరిపోతున్నాయన్నారు. కాంగ్రెస్ నాయకులు అధికారులకు వత్తాసు పలుకుతూ బీసీలకు పోడు భూములపై హక్కు లేదనడం అన్యాయమని పేర్కొన్నారు. బాధిత రైతుల పక్షాన సోమవారం అటవీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని తెలిపారు. ఈకార్యక్రమాని కి పోడు రైతులు, వివిధ సంఘాల నాయకులు తరలిరావాలని కోరారు. సమావేశంలో జిల్లా అధ్యక్షు డు దోని శ్రీశైలం, రాష్ట కార్యవర్గ సభ్యులు కొంగ సత్యనారాయణ, జిల్లా కోశాధికారి అరుణ్‌లోయ, ఓబీసీ మోర్చ రాష్ట కార్యవర్గ సభ్యుడు గొలెం వెంకటేశ్, జిల్లా కార్యదర్శి రాజేందర్‌గౌడ్, మండల అధ్యక్షుడు విజయ్, మాజీ కౌన్సిలర్ ఈర్ల విశ్వేశ్వర్‌రావు, రాపర్తి ధనుంజయ్, సుధాకర్, వెంకన్న, భుజంగరావు, తిరుపతి, సదానందం, సత్యనారాయణ, సంతోష్, బావూజీ తదితరులు పాల్గొన్నారు.