
చర్చలు సఫలం.. సమ్మె వాయిదా
ఆసిఫాబాద్‌అర్బన్: పెండింగ్ వేతనాలు చెల్లించడంతోపాటు మూడేళ్ల ఈపీఎఫ్, ఈఎస్‌ఐ వివరాలు వెల్లడించాలని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న శానిటేషన్, పేషంట్ కేర్, సెక్యూరిటీ సిబ్బంది ఏఐటీయూసీ, సీటీయూసీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో మూడు రోజులుగా నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే. గురువారం ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రవీణ్ వారితో చర్చలు జరిపారు. చర్చలు సఫలం కావడంతో సమ్మె వాయిదా వేస్తున్నట్లు నాయకులు ప్రకటించారు. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉపేందర్, జిల్లా ఉపాధ్యక్షుడు చిరంజీవి, సీఐటీయూ నాయకులు శ్రీకాంత్, ఎమ్మార్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు కేశవ్, బీజేపీ ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు జయరాజ్ మాట్లాడారు. ఈ నెల 24లోగా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.