
ఆదివాసీ హక్కుల కోసం ఉద్యమించాలి
కాగజ్‌నగర్‌టౌన్: ఆదివాసీ హక్కుల పరిరక్షణకు ఐక్యంగా ఉద్యమించాలని ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎర్మ పున్నం అన్నారు. కాగజ్‌నగర్ పట్టణంలోని పద్మశాలి భవనంలో జిల్లా సంఘం అధ్యక్షులు కొరెంగ మాలశ్రీ అధ్యక్షతన గురువారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ముగింపు సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన హక్కులను సైతం ప్రభుత్వాలు హరించివేస్తున్నాయని ఆరోపించారు. అడవులను కార్పొరేట్ శక్తులకు అప్పగించేందుకు 2023లో నూతన అటవీ హక్కు చట్టం తీసుకువచ్చారని అన్నారు. తాత్కాలికంగా నిలుపుదల చేసిన జీవో 49ను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆదివాసీల సమస్యలు పరిష్కరించాలని కోరారు. సమావేశంలో వివిధ సంఘాల నాయకులు నెర్పల్లి అశోక్, కోట శ్రీనివాస్, బక్కన్న, శ్యాం, కమల, మడే శశి, సుర్పం రాంచందర్, ఆత్రం చిన్ను, ముంజం ఆనంద్‌కుమార్, జాడి మల్లయ్య, టీకానంద్, కార్తీక్, దుర్గం దినకర్, నంది పద్మ, కూశన రాజన్న, ఊట్ల రవి పాల్గొన్నారు.