పెంచికల్‌పేట్: మండలంలోని అగర్‌గూడ అటవీ ప్రాంతంలో నీలుగాయిని హతమార్చి న నలుగురిని అరెస్ట్ చేసినట్లు పెంచికల్‌పేట్ డిప్యూటీ రేంజ్ అధికారి జమీల్ శనివారం తెలిపారు. శుక్రవారం రాత్రి కొమ్ముగూడ–అగర్‌గూడ రహదారిపై పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా కని పించడంతో అదుపులోకి తీసుకుని రేంజ్ కార్యాలయానికి తరలించి విచారించగా అగర్‌గూడ బీట్ పరిధిలో విద్యుత్ తీగలను అమర్చి నీలుగా యిని హతమార్చినట్లు అగీకరించారన్నారు. సంఘటన స్థలానికి తీసుకెళ్లి వేటాడటానికి ఉపయోగించిన తీగలను స్వాధీనం చేసుకున్నామన్నారు. నీలుగాయిని వేటాడిన పెంచికల్‌పేట్‌కు చెందిన అప్పాజి శ్రీనివాస్, అప్పాజి వెంకటేశ్, మేకల ర మేశ్, ఒడ్డుగూడకు చెందిన బీంకరి తిరుపతిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు వెల్లడించారు. ఆయన వెంట బీట్ అధికారులు సతీశ్, సంగదీప్, మహేష్, దినేష్, సిబ్బంది ఉన్నారు.