తక్షణమే ప్రమోషన్లు కల్పించాలని వినతి
రెబ్బెన: అర్హులైన ఉద్యోగులకు పంప్ ఆపరేటర్(పీవోపీ) ప్రమోషన్లను తక్షణమే కల్పించాలని టీబీజీకేఎస్ బెల్లంపల్లి ఏరియా కార్యదర్శి మారిన వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఖైరిగూర ఓసీపీలో మేనేజర్ శంకర్‌కు మంగళవారం వినతిపత్రం అందించారు. ఆయన మాట్లాడుతూ కొన్ని రోజులుగా పంప్ ఆపరేటర్ ప్రమోషన్లు ఇవ్వకుండా కాలయాపన చే స్తున్నా గుర్తింపు సంఘం ఏఐటీయూసీ నిమ్మ కు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. నూతనంగా విధుల్లో చేరిన మహిళ ఉద్యోగులకు పరిసరాలు, గనిపై అవగాహన కల్పించిన తర్వాత షిప్ట్‌లో విధులు కేటాయించాలన్నారు. వారికి రెస్ట్ రూములు, అటాచ్డ్ బాత్‌రూంలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఫిట్ కార్యదర్శి వెంకటేశ్, నాయకులు కైత స్వామి, కుదిరె మొగులయ్య, షిఫ్ట్ ఇన్‌చార్జీలు కృష్ణ, రవి, రాజేశం, చందర్, మల్లేశ్, తిరుపతి, సురేశ్, సంజీవ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.


