కౌలుకు సాగు.. ఎద్దులపై ప్రేమ
కాగజ్‌నగర్‌రూరల్: రాస్పెల్లికి చెందిన ఇనుముల శ్రీకాంత్ కుటుంబానికి వారసత్వంగా ఎలాంటి భూమి లేదు. భార్య అంజలి, పిల్ల లు త్రినేయ, మన్వితతో కలిసి ఉంటున్నాడు. కౌలుకు తీసుకుని పదెకరాల్లో వరి, 15 ఎకరాల్లో పత్తి పండిస్తున్నాడు. వ్యవసాయం కౌలుకు చేస్తున్నా రెండు ఎడ్లను ప్రేమతో పెంచుతున్నాడు. వాటి పోషణ కోసం ఏటా సుమారు రూ.50వేలు ఖర్చు చేస్తున్నట్లు తెలిపాడు. ఒక్కో వరి గడ్డి కట్టకు రూ.100, క్వింటాల్ తౌడు బస్తాకు రూ.2400 వెచ్చిస్తున్నాడు. తాను అందుబాటులో లేని సమయంలో తన భార్య వాటి బాగోగులను చూస్తుందని చెబుతున్నాడు.


