● మొదలైన సంక్రాంతి సందడి ● నేడు భోగి వేడుకలు ● స్వగ్రామ
ఆసిఫాబాద్‌అర్బన్: రంగవల్లులు, గొబ్బెమ్మలు, పతంగులు, పిండి వంటల ఘుమఘుమలు, హరి దాసు పాటలు, బసవన్నల ఆటలతో పల్లె లోగిళ్లు సంక్రాంతి శోభను సంతరించుకున్నాయి. జిల్లావ్యాప్తంగా నేటి నుంచి పండుగ సంబురాలు ప్రారంభం కానున్నాయి. బుధవారం భోగి, గురువారం మకర సంక్రాంతి, శుక్రవారం కనుమ జరుపుకోనున్నారు. ఈ నెల 10న రెండో శనివారం కూడా కలిసిరావడంతో హైదరాబాద్ వంటి నగరాల్లో ఉంటున్న జిల్లా ప్రజలు ఇప్పటికే పల్లెబాట పట్టారు. ఆర్టీసీ బస్సుల్లో రద్దీ పెరగడంతో ప్రైవేటు వాహనాలను ఆశ్రయించి ఇళ్లకు చేరుకుంటున్నారు.
పండుగ సందడి
సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఇళ్ల ముంగిట ముత్యాల ముగ్గులు ఆకట్టుకుంటున్నాయి. ఆవుపేడతో గొబ్బెమ్మలు, రేగుపళ్లు, నవధాన్యాలు, గరిక, పూలను అందంగా అలంకరిస్తున్నారు. జిల్లా కేంద్రంతోపాటు కాగజ్‌నగర్ పట్టణంలోని మార్కెట్లో రంగుల దుకాణాలు వెలిశాయి. కొత్తగా పెళ్లయిన వారు నోములు నోచుకోవడం సంప్రదాయం. అలాగే పండుగకు చకినాలు, గారెలు, అరిసెలు, లడ్డూలు, ఇతర పిండి వంటలను ఆస్వాదిస్తారు. ఇళ్లల్లో చకినాల ఘుమఘుమలు వెదజల్లుతున్నాయి. ఉమ్మడి కుటుంబాల్లో పది రోజుల ముందు నుంచే పిండివంటల తయారీని ప్రారంభించారు. ఇరుగుపొరుగు వారు ఒకరికొకరు సాయంగా నిలిచారు. ఇక చిన్నారులు రంగురంగుల పతంగులతో సెలవులను ఆస్వాదిస్తున్నారు. గ్రామంలోని స్నేహితులతో సందడి చేస్తున్నారు.
● మొదలైన సంక్రాంతి సందడి ● నేడు భోగి వేడుకలు ● స్వగ్రామ
● మొదలైన సంక్రాంతి సందడి ● నేడు భోగి వేడుకలు ● స్వగ్రామ


