మహిళా ఉద్యోగులకు షిఫ్ట్‌లు నిలిపివేయాలి
రెబ్బెన: ఖైరిగూర ఓసీపీలో మహిళా ఉద్యోగులకు జనరల్, సెకండ్ షిఫ్ట్‌లు తక్షణమే నిలిపివేయాలని ఏఐటీయూసీ ఫిట్ కార్యదర్శి మారం శ్రీనివాస్ కోరారు. గని మేనేజర్ శంకర్‌తో మంగళవారం సమావేశమై ఓసీపీలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగుల సమస్యలపై చర్చించారు. మహిళా ఉద్యోగులకు రెస్ట్‌రూంలు, వాష్‌రూంలు ఏర్పాటు చేయాలన్నారు. జీఎం కమిటీ సభ్యులు రాజేశ్, ఆర్గనైజింగ్ కార్యదర్శులు కిరణ్‌బాబు, చంద్రశేఖర్, సహాయకార్యదర్శి ఓదెలు, షిఫ్ట్ ఇన్‌చార్జి అంజయ్య, రాయిని రాజయ్య, మహిళా మైన్ కమిటీ సభ్యులు మాయ తదితరులు పాల్గొన్నారు.


