మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరేయాలి
నేరడిగొండ: మున్సిపల్ ఎన్నికల్లో అన్ని బల్దియాల్లో బీఆర్‌ఎస్ జెండా ఎగరేయాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నేతలతో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలన్నారు. ఎన్నికల్లో పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేసి, గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, స్థానిక సమస్యలు, పార్టీ బలోపేతంపై నాయకులతో చర్చించారు. సమావేశంలో ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు అనిల్ జాదవ్, కోవ లక్ష్మి, మాజీ ఎమ్మెల్యేలు జోగు రామన్న, కోనేరు కోనప్ప, దుర్గం చిన్నయ్య, బాల్క సుమన్ తదితరులు పాల్గొన్నారు.


