వలస కూలీల తిరుగు ప్రయాణం
కాగజ్‌నగర్‌టౌన్: ‘స్వస్థలంలో ఉపాధి పనులు దొరకక ఎంతో అలమటించామని, తెలంగాణ రాష్ట్రంలో మెరుగైన ఉపాధి అవకాశాలు ఉన్నాయని రాజస్తానీ కూలీలు పేర్కొన్నారు. జిల్లాలో పత్తి తీసేందుకు వచ్చిన వలస కూలీలు ఆదివారం స్వస్థలాలకు తిరుగు ప్రయాణమయ్యారు. రెండు నెలల క్రితం కుటుంబాలతో వచ్చిన వారిని జిల్లా రైతులు అక్కున చేర్చుకుని సౌకర్యాలు కల్పించారు. ఆహార ధాన్యాలు అందించడంతోపాటు వారానికి ఒకసారి మాంసాహారం అందించారు. కుటుంబ సభ్యుల మాదిరిగా బాగోగులు చూసుకున్నారు. ప్రస్తుతం పత్తితీత పనులు తుదిదశకు చేరడంతో గ్రామాల్లోని పెద్దవారిని చూసుకునేందుకు వెళ్తున్నామని కూలీలు పేర్కొన్నారు.


