బ్రాహ్మణ సంఘం కార్యవర్గం ఎన్నిక
ఆసిఫాబాద్‌అర్బన్: ఆ సిఫాబాద్ పట్టణ బ్రా హ్మణ సంఘం నూతన కార్యవర్గాన్ని ఆదివా రం సాయంత్రం జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణవాడ మినీ ఫంక్షన్ హాల్‌లో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పట్టణ అధ్యక్షుడిగా వైరాగడె ప్రతాప్, గౌరవ అధ్యక్షుడిగా సుగుణాకర్, ఉపాధ్యక్షులుగా అభయ్‌కుమార్, శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా పరాండే సాయి, సంయుక్త కార్యదర్శులుగా ఆమ్టే అనూప్‌కుమార్, బాలకిషన్, కోశాధికారిగా అనంత్, ప్రచార కార్యదర్శిగా వారణాసి శ్రీని వాస్‌రావ్, సాయికృష్ణ, న్యాయ సలహాదారులుగా దీపక్, రామకృష్ణను ఎన్నుకున్నారు. అలాగే మహిళా సమాజ్ అధ్యక్షులుగా ఆరతి, గౌరవ అధ్యక్షులుగా ఆమ్టే శ్రీమతి, ఉపాధ్యక్షులుగా మసాదె స్వాతి, ప్రధాన కార్యదర్శిగా శ్రుతిక, సహాయ కార్యదర్శులుగా మంతెన ఉమ, జయంతి, కోశాధికారిగా కీర్తిని ఎన్నుకున్నారు. నూతన కమిటీ ప్రతినిధులను శాలువాలతో సత్కరించారు.


