ఓబన్న జీవితం అందరికీ ఆదర్శం
ఆసిఫాబాద్‌అర్బన్: బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడిన ఒడ్డె ఓబన్న జీవితం అందరికీ ఆదర్శమని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఆదివారం ఒడ్డె ఓబన్న జ యంతి నిర్వహించారు. ఒడ్డెర నాయకులు, ప్రముఖులతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఒడ్డె ఓబన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ రేనాడు ప్రాంతంలో 1816 జనవరి 11న జన్మించాడని తెలిపారు. 18వ శతాబ్దంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి ప్రధాన అనుచరుడిగా సంచార జాతులైన వడ్డెరలు, బోయలు, చెంచు ప్రజలకు నాయకత్వం వహించారని పేర్కొన్నారు. నల్లమల ప్రాంతంలో బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆగడాలను ఎదుర్కొన్నారని కొనియాడారు. ప్రభుత్వం ఓబన్న జయంతిని అధికారికంగా నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు.


