28న అథ్లెటిక్స్ జిల్లాస్థాయి ఎంపిక పోటీలు
ఆసిఫాబాద్‌రూరల్: జిల్లా కేంద్రంలోని ఆదర్శ గిరిజన క్రీడా పాఠశాలలో ఈ నెల 28న జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి శంకర్ ఒక ప్రకటనలో తెలిపారు. అండర్ 8 విభాగంలో బాలబాలికలకు 50 మీటర్లు, 150 మీటర్ల రన్నింగ్, అండర్ 10 విభాగంలో బాలబాలికలకు 80, 300 మీటర్ల రన్నింగ్, లాంగ్‌జంగ్, అండర్ 12 విభాగంలో బాలబాలికలకు 100, 400 మీటర్ల రన్నింగ్, లాంగ్‌జంప్, జావెలిన్ త్రో, అండర్ 14 విభాగంలో 100, 400 మీటర్ల రన్నింగ్, అండర్ 16 విభాగంలో 100, 400 మీటర్ల రన్నింగ్, అండర్ 18 విభాగంలో 100, 200, 400 మీటర్ల రన్నింగ్, షాట్‌పుట్, లాంగ్‌జంప్, డిస్క్ త్రో, అండర్ 20 విభాగంలో 100, 400 మీటర్ల పరుగు పందెం ఉంటుందని పేర్కొన్నారు. ఆసక్తి గల విద్యార్థులు బోనఫైడ్, ధ్రువీకరణ పత్రాలను కోచ్ విద్యాసాగర్‌కు అందించాలని సూచించారు. వివరాలకు 80080 90626 సంప్రదించాలని కోరారు.
నేడు కౌలు భూముల వేలం
ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లా కేంద్రంలోని శ్రీకేశవనాథ స్వామి ఆలయ పరిధిలోని వ్యవసాయ భూములను ఒక సంవత్సరం కౌలు నిమిత్తం ఆలయ ఆవరణలో శనివారం ఉద యం 11.30 గంటలకు బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు దేవాదాయ, ధర్మదాయ శాఖ ఆలయ కార్యనిర్వాహక అధికారి వేణుగోపాల్ గుప్తా ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే గుండి శివారులోని సర్వే నం.94లో 11ఎకరాల 16 గుంటలకు వేలం ద్వారా రూ.1,54,000 ఆదాయం సమకూరిన విషయం తెలిసిందే. నేడు మిగిలిన భూములకు వేలం నిర్వహించనున్నారు. వేలంలో పాల్గొనేవారు ఆధార్‌కార్డు, బ్యాంకు అకౌంట్ బుక్ జిరాక్స్‌లతోపాటు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు తెచ్చుకోవాలన్నారు. ధరావత్తు సొమ్ము రూ.50వేలు ముందుగానే చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.