వైరా: వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారాన్ని అందించాలని కలెక్టర్ దివాకర టీ.ఎస్. సూచించారు. వైరాలోని బీసీ బాలికల వసతి గృహాన్ని గురువారం తనిఖీ చేసిన ఆయన స్టోర్ రూమ్, కిచెన్‌ను పరిశీలించారు. ఆహార పదార్థాల నాణ్యత, మెనూ అమలుపై విద్యార్ధులతో మాట్లాడారు. విద్యార్థుల ఆరోగ్యం, సంక్షేమం విషయంలో వసతి గృహ సంక్షేమ అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ సూచించారు. ఆహారం, తాగునీటి నాణ్యతలో రాజీ పడొడ్దని తెలిపారు. బీసీ సంక్షేమ శాఖ డీడీ జి.జ్యోతి, తహసీల్దార్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.
ప్రణాళికాయుతంగా వసతులు
ఖమ్మంరూరల్: ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి పోలేపల్లిలో టీజీఈ హైట్స్ రెసిడెన్షియల్ గేటెడ్ టౌన్‌షిప్‌ను కలెక్టర్ దివాకర టీ.ఎస్. పరిశీలించారు. గృహ సముదాయంలో జరుగుతున్న పనులను అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డితో కలిసి గురువారం పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా టీజీ గెజిటెడ్ హౌసింగ్ సొసైటీకి కేటాయించిన టౌన్‌షిప్‌లో మౌలిక వసతుల కల్పన, నిర్మాణం పూర్తయిన మోడల్ ప్లాట్‌న పరిశీలించాక మాట్లాడారు. మొత్తం ఎనిమిది బ్లాక్‌ల్లో 576 ఫ్లాట్లు ఉండగా, అవసరమైన మౌలిక సదుపాయాలను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయాలని సూచించారు. హౌజింగ్ పీడీ భూక్యా శ్రీనివాస్, ఆర్‌డీఓ ఎన్.శ్రీనివాస్, టీజీవోస్ హౌస్ బిల్డింగ్ సొసైటీ అధ్యక్ష, కార్యదర్శులు కొండపల్లి శేషుప్రసాద్, డాక్టర్ విజయ్‌కుమార్, టీఎన్జీవోస్, టీజీవోస్ జిల్లా అధ్యక్షులు గుంటుపల్లి శ్రీనివాసరావు, కొంగర వెంకటేశ్వర రావుతో పాటు యర్రా రమేష్, తాళ్లూరి శ్రీకాంత్, ఏలూరి కోణార్క్, మోదుగ వేలాద్రి, సూరంపల్లి రాంబాబు, తహసీల్దార్ వినేందర్‌రెడ్డి, పాల్గొన్నారు.
వైరా బీసీ హాస్టల్ తనిఖీలో కలెక్టర్ దివాకర


