గంజాయి వినియోగం కట్టడిపై దృష్టి | - | Sakshi
Sakshi News home page

గంజాయి వినియోగం కట్టడిపై దృష్టి

Nov 20 2026 1:07 AM | Updated on Nov 20 2026 1:07 AM

ఖమ్మం మయూరిసెంటర్‌(ఖమ్మంక్రైం): గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగం కట్టడిపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాలని, అవసరమైతే నిందితులపై పీడీ యాక్ట్‌ నమోదు చేయాలని పోలీసు కమిషనర్‌ సునీల్‌దత్‌ ఆదేశించారు. ఖమ్మం వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ను గురువారం తనిఖీ చేసిన ఆయన పెండింగ్‌ కేసులు, దర్యాప్తు పురోగతిపై ఆరా తీశాక మాట్లాడారు. రాత్రి వేళ గస్తీని మరింత ముమ్మరం చేయడమే కాక అనుమానాస్పద వ్యక్తులు, నిర్మానుష్య ప్రాంతాలపై నిఘా వేయాలని తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణకు సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉంటూ, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు.

ఇద్దరికి పదోన్నతి

వివిధ పోలీస్‌ స్టేషన్లలో ఏఎస్సైలుగా విధులు నిర్వర్తిస్తున్న ఇద్దరికి ఎస్సైలుగా పదోన్నతి లభించింది. ఈ సందర్భంగా పదోన్నతి పొందిన ఎస్‌.డీ.సలీమాబేగం, టి.నాగరాజా కుమారికి సీపీ సునీల్‌దత్‌ గురువారం పదోన్నతి చిహ్నాలు అలంకరించి అభినందించారు.

పోలీసు కమిషనర్‌ సునీల్‌దత్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement