గత కొద్దినెలల్లో వెలువడిన తీర్పుల్లో కొన్ని... | - | Sakshi
Sakshi News home page

గత కొద్దినెలల్లో వెలువడిన తీర్పుల్లో కొన్ని...

Nov 18 2026 12:38 AM | Updated on Nov 18 2026 12:38 AM

గత కొద్దినెలల్లో వెలువడిన తీర్పుల్లో కొన్ని...

నేరస్తులు తప్పించుకోకుండా

పకడ్బందీగా చార్జీషీట్లు

ట్రయల్‌ నుంచి తుది తీర్పు వరకు

పర్యవేక్షణ

‘కోర్టు మానిటరింగ్‌ సిస్టమ్‌’పై

సీపీ ప్రత్యేక దృష్టి

విచారణలో జాప్యం

వివిధ ఘటనల్లో అందుతున్న ఫిర్యాదులతో కేసులు నమోదు చేస్తున్నా విచారణలో మాత్రం జాప్యం జరుగుతోంది. ట్రయల్‌ నుంచి సాక్ష్యాధారాల సేకరణ వరకు ఆలస్యమవుతోంది. ఫలితంగా నిందితులు సమాజంలో నిర్భయంగా తిరిగేందుకు ఆస్కారం ఏర్పడుతోంది. కొన్ని కేసులు ఏళ్ల తరబడి పెండింగ్‌ ఉంటుండడంతో చేసేదేం లేక కొందరు బాధితులు రాజీకి దిగే పరిస్థితులు ఎదురవుతున్నాయి.

సమన్వయంతోనే సత్వర న్యాయం

బాధితులకు త్వరగా న్యాయం చేయడమే లక్ష్యంగా సీపీ సునీల్‌దత్‌ కోర్టు మానిటరింగ్‌ సిస్టమ్‌ను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. కేసు దర్యాప్తు నుంచి తుది తీర్పు వెలువడే వరకు ప్రతీ దశను కీలకంగా భావిస్తూ యంత్రాంగం ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు, కోర్టు డ్యూటీ ఆఫీసర్లు, దర్యాప్తు అధికారులు, సాక్షుల మధ్య పటిష్టమైన సమన్వయాన్ని పెంపొందిస్తున్నారు. పక్కా ఆధారాలు, బలమైన సాక్ష్యాలను న్యాయస్థానం ముందు ఉంచడం ద్వారా శిక్షల శాతాన్ని పెంచేలా చర్యలు తీసుకుంటున్నారు. ఫలితంగా జిల్లాలో ఇటీవల పలు కేసుల్లో తీర్పులు వెలువడ్డాయి.

సీపీ చొరవతో..

జిల్లాలో నమోదవుతున్న కేసుల్లో నిందితులకు శిక్ష పడేలా పోలీస్‌ కమిషనర్‌ సునీల్‌దత్‌ కోర్టు మానిటరింగ్‌ సిస్టంపై దృష్టి సారించారు. దీర్ఘకాలంగా పెండింగ్‌ ఉన్న కేసుల వివరాలను సమీక్షిస్తూ, విచారణ వేగవంతమయ్యేలా పర్యవేక్షిస్తున్నారు. కేసుల వారీగా గడువులోగా పక్కా ఆధారాలతో చార్జీషీట్లు దాఖలు చేయిస్తూనే విచారణ పురోగతిని గమనిస్తున్నారు. విచారణ సమయంలో సాక్షులు ఆందోళనకు గురికాకుండా కోర్టుకు హాజరయ్యేలా పోలీసులు సమన్వయం చేస్తున్నారు. అలాగే, ప్రాసిక్యూషన్‌ తరఫున వాదనలు బలంగా వినిపించేలా సహకరిస్తున్నారు. అంతేకాక న్యాయస్థానాలు జారీ చేసిన సమన్లు, నాన్‌–బెయిలబుల్‌ వారెంట్ల (ఎన్‌బీడబ్ల్యూ)ను జాప్యం లేకుండా అందిస్తుండడంతో నిందితులకు తప్పించుకునే మార్గాలు మూసుకుపోతున్నాయి.

పోలీసుల నుంచి తప్పించుకునే క్రమాన దాడి చేసిన నిందితుడికి సత్తుపల్లి కోర్టు అక్టోబర్‌ 28న పదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.20వేల జరిమానా విధించింది.

మధిరలో బాలికపై లైంగిక దాడికి పాల్ప డిన నిందితుడికి ఈనెల 2న ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ పోక్సో కోర్టు తీర్పు వెలువరించింది.

చింతకానిలో నమోదైన పోక్సో కేసులో ముగ్గురికి పోక్సో కోర్టు న్యాయమూర్తి ఆగస్టు 25న జీవితఖైదు విధించారు.

మరో రెండు పోక్సో కేసుల్లో నిందితుడికి జూన్‌ 10న మూడున్నరేళ్ల జైలుశిక్ష విధిస్తూ ఖమ్మం మొదటి అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి తీర్పు చెప్పారు.

ఇంకో పోక్సో కేసులో నిందితుడికి ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ ఈ ఏడాది మే 27న ఖమ్మం మొదటి అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి తీర్పు వెలువరించారు.

కేసుల పరిష్కారంపై పోలీసు శాఖ కార్యాచరణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement