రాజకీయాలకతీతంగా పథకాలు | - | Sakshi
Sakshi News home page

రాజకీయాలకతీతంగా పథకాలు

Nov 18 2026 12:38 AM | Updated on Nov 18 2026 12:38 AM

● గులాబీ చొక్కా వేసుకున్నా.. పేదలైతే చాలు ఇందిరమ్మ ఇళ్లు ● రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

● గులాబీ చొక్కా వేసుకున్నా.. పేదలైతే చాలు ఇందిరమ్మ ఇళ్లు ● రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

సత్తుపల్లి(వేంసూరు): రాజకీయాలకు అతీతంగా అర్హతే ప్రాతిపదికన రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు ఇస్తున్నామని, గులాబీ చొక్కా వేసుకున్న వారైనా పేదలైతే చాలు పథకాలు అందుతాయని తెలిపారు. వేంసూరు మండలంలో కొత్తగా పింఛన్లు మంజూరైన వారికి మంగళవారం ఆయన ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి, కలెక్టర్‌ దివాకర టీ.ఎస్‌., ఎమ్మెల్యే డాక్టర్‌ రాగమయి దయానంద్‌తో కలిసి ప్రొసీడింగ్‌ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తమ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూ.40 వేల కోట్లు కేటాయించామని తెలిపారు. ప్రజలు, యువత దీవించిన తమ ప్రభుత్వంలో 73 వేల ఉద్యోగాలు భర్తీ చేయగా, మరో 14 వేల ఉద్యోగాలను నోటిఫికేషన్‌ ఇచ్చామని చెప్పారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు దక్కేవరకు ఎన్ని విడతలైనా మంజూరు చేస్తామని తెలిపారు. రైతును రాజుగా చేయాలని భావనతో రైతు భరోసా అమలుచేస్తుండగా సన్నధాన్యానికి మద్దతు ధరతో పాటు రూ.500 బోనస్‌ చెల్లిస్తున్నామని తెలిపారు. ఎల్‌నినో ప్రభావంతో విద్యుత్‌ ఉత్పత్తి ఇబ్బంది ఎదురవుతున్నప్పటికీ యూనిట్‌ రూ. 15 పెట్టి కొనుగోలు చేసి పంటలకు సరఫరా చేస్తున్నామని మంత్రి వివరించారు. గత పాలకులు చేసిందేమీ లేకపోగా, పేదలు ఇళ్లను కాదని రూ.కోట్ల కమీషన్‌ వచ్చే కాళేశ్వరం కట్టారని మండిపడ్డారు. అదీకాక తమ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఓర్వలేక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. గత పాలకులు మహిళలకు ఇచ్చిన చీరలు పంట పొలాలకు కంచెలుగా మారితే, తాము మాత్రం మహిళందరికీ ఈనెల 19నుంచి చిలక పచ్చ రంగు చీరలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. కల్లూరు సబ్‌కలెక్టర్‌ అజయ్‌ యాదవ్‌, మార్కెట్‌ చైర్మన్‌ నర్సింహారావు, తహసీల్దార్‌ మాణిక్‌రావు, ఎంపీఓ రంజిత్‌తో పాటు నాయకులు ఎం.డీ.ఫకృద్దీన్‌, అట్లూరి సత్యనారాయణరెడ్డి, బండి శ్రీనివాసరెడ్డి, గొర్ల వెంకటప్పరెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement