నేడు మంత్రి పొంగులేటి పర్యటన | - | Sakshi
Sakshi News home page

నేడు మంత్రి పొంగులేటి పర్యటన

Nov 18 2026 12:38 AM | Updated on Nov 18 2026 12:38 AM

ఖమ్మంమయూరిసెంటర్‌: రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బుధవారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 9గంటలకు కల్లూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పీఎస్‌ఆర్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన వాటర్‌ ఫ్యూరిఫికేషన్‌ ప్లాంట్‌ను ప్రారంభిస్తారు. ఆతర్వాత కల్లూరు మున్సిపాలిటీ పరిధిలో చేయూత పింఛన్‌ మంజూరైన వారికి పత్రాలు పంపిణీ చేయనున్నారు. అనంతరం ఖమ్మం దానవాయిగూడెంలో 1, 59, 60వ డివిజన్ల పరిధిలో లబ్ధిదారులకు చేయూత పెన్షన్‌ మంజూరు పత్రాలను మంత్రి పంపిణీ చేస్తారు.

మధిరకు జిల్లా

ఇన్‌చార్జ్‌ మంత్రి శ్రీహరి

మధిర: ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి వాకిటి శ్రీహరి బుధవారం మధిరలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఉదయం 10గంటలకు మధిరలో జరిగే కార్యక్రమంలో పట్టణ, మండల పరిధిలో కొత్తగా చేయూత పింఛన్లు మంజూరైన లబ్ధిదారులకు ప్రొసీడింగ్‌ పత్రాలు అందజేస్తారు. ఈమేరకు ఏర్పాట్లను మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సామినేని సుజాత రామనాథం, వైస్‌ చైర్మన్‌ కోనా ధనికుమార్‌, నాయకులు పారుపల్లి విజయ్‌కుమార్‌, తలుపుల వెంకటేశ్వర్లు మంగళవారం పరిశీలించారు.

సమ్మిళిత విద్యలో

అగ్రస్థానాన జిల్లా

ఖమ్మం సహకారనగర్‌: సమ్మిళిత విద్య(ఇన్‌క్లూజివ్‌ ఎడ్యుకేషన్‌) విభాగంలో ప్రగతి సాధించిన జిల్లా రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానాన నిలిచింది. ప్రశస్త యాప్‌ ద్వారా పార్ట్‌–1 స్క్రీనింగ్‌, ప్రతీనెల పేరెంట్‌ టీచర్‌ మీటింగ్‌ నిర్వహణ, యూనిఫామ్‌ పంపిణీ, ప్రత్యేక అవసరాల విద్యార్థుల కోసం భవిత కేంద్రాల నిర్వహణ, ఫిజియోథెరపీ సేవల్లో జిల్లా అగ్రస్థానం దక్కించుకుంది. ఈ మేరకు హైదరాబాద్‌లో మంగళవారం జిల్లా విద్యాశాఖ కమ్యూనిటీ మొబిలైజింగ్‌ అధికారి(సీఎంఓ) బాజోజు ప్రవీణ్‌కుమార్‌కు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ నవీన్‌ నికోలస్‌ ప్రశంసాపత్రం అందజేసి సన్మానించారు. ఈ సందర్భంగా ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడుతూ కలెక్టర్‌ దివాకర, అదనపు కలెక్టర్‌ శ్రీజ, డీఈఓ డి.వాసంతి నిరంతర పర్యవేక్షణతో సమ్మిళిత విద్యా కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు.

పెండింగ్‌ కేసుల

దర్యాప్తులో వేగం

● పోలీసు కమిషనర్‌ సునీల్‌దత్‌

తల్లాడ: బాధితులకు న్యాయం జరిగేలా పెండింగ్‌ కేసుల దర్యాప్తులో వేగం పెంచాలని పోలీసు కమిషనర్‌ సునీల్‌దత్‌ ఆదేశించారు. తల్లాడ పోలీసుస్టేషన్‌ను మంగళవారం తనిఖీ చేసిన ఆయన స్టేషన్‌ నిర్వహణ, రికార్డులు, పెండింగ్‌ కేసుల వివరాలపై ఆరా తీశాక మాట్లాడారు. పెండింగ్‌ కేసుల దర్యాప్తులో వేగం పెంచడమే కాక పకడ్బందీ సాక్ష్యాలతో కోర్టుల్లో చార్జీషీట్లు దాఖలు చేయాలని, తద్వారా నిందితులు శిక్ష నుంచి తప్పించుకోలేరని తెలిపారు. అలాగే, క్రైమ్‌ అండ్‌ క్రిమినల్‌ ట్రాకింగ్‌ నెట్‌వర్క్‌ సిస్టమ్స్‌లో దర్యాప్తు వివరాలు నమోదు చేయాలని సూచించారు. వైరా సీఐ వెంకటప్రసాద్‌, ఎస్‌ఐలు ఎన్‌.వెంకటకృష్ణ, వెంకటేశ్‌, సిబ్బంది పాల్గొన్నారు.

వ్యాధుల సంక్రమణ, నివారణపై అవగాహన

ఖమ్మం వైద్యవిభాగం: హెచ్‌ఐవీ, సిఫిలిస్‌ వ్యాధులు తల్లి నుంచి బిడ్డకు సంక్రమించకుండా నివారించడంపై ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ అధ్యాపకులు, వైద్యులు, విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రి సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ప్రోగ్రామ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ దీపాలి మాట్లాడుతూ గర్భిణులకు హెచ్‌ఐవీ, సిఫిలిస్‌ పరీక్షలు నిర్వహించి, వ్యాధి నిర్ధారణ జరిగితే చికిత్స అందించాలని తెలిపారు. గర్భిణులకు ముందస్తు పరీక్షలు, కౌన్సెలింగ్‌, థెరపీ, సురక్షిత ప్రసవం, శిశువులకు వైద్యసేవలు అందిస్తే వ్యాధుల సంక్రమణకు అడ్డుకట్ట వేయొచ్చని చెప్పారు. మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ శంకర్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌ రాజేశ్వరరావుతో పాటు సూపరింటెండెంట్‌ కిరణ్‌, అధ్యాపకులు సరిత పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement