సీపీఎస్‌ను రద్దు చేయాల్సిందే.. | - | Sakshi
Sakshi News home page

సీపీఎస్‌ను రద్దు చేయాల్సిందే..

Nov 18 2026 12:38 AM | Updated on Nov 18 2026 12:38 AM

ఖమ్మం సహకారనగర్‌: కాంగ్రెస్‌ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌(సీపీఎస్‌)ను రద్దు చేసి ఓల్డ్‌ పెన్షన్‌ స్కీమ్‌(ఓపీఎస్‌)ను పునరుద్ధరించాలని సీపీఎస్‌ ఈయూ జిల్లా అధ్యక్షుడు చంద్రకంటి శశిధర్‌ డిమాండ్‌ చేశారు. ఓపీఎస్‌ను పునరుద్ధరిస్తామని ప్రకటించి మూడేళ్లు పూర్తయిన నేపథ్యాన కలెక్టరేట్‌ వద్ద ధర్నాచౌక్‌లో సీపీఎస్‌ ఉద్యోగులు మంగళవారం ధర్మదీక్ష నిర్వహించారు. సామూహిక సెలవు పెట్టిన ఉద్యోగులు దీక్షలో పాల్గొనగా, శశిధర్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ మూడేళ్ల క్రితం ఇచ్చిన హామీని ఇప్పటివరకు నెరవేర్చలేదన్నారు. ఇప్పటికై నా కాలయాపన చేయకుండా పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలన్నారు. ఉద్యోగుల ఆకాంక్షలను ఉద్యమాల రూపంలో వ్యక్తపరిస్తే అణచివేయాలని చూడడం సరికాదన్నారు. అనంతరం కలెక్టర్‌ దివాకరకు వినతిపత్రం అందజేశారు. ఈ దీక్షకు వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు తిలక్‌, వై.గామయ్య, శ్రీనివాస్‌, రవిచౌహాన్‌ మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌ సీపీఎస్‌ ఈయూ నాయకులు డాక్టర్‌ హరికిషన్‌ సింగ్‌, రాగి సురేష్‌, గుగులోత్‌ మోహన్‌, క్రాంతికుమార్‌, ఎం.శ్వేత, జిలాని, టి.సాయికృష్ణ, నరసింహారావు, రాజశేఖర్‌, జానీమియా, వినోద్‌, చైతన్య, దేవేందర్‌, ఎస్‌.రమేష్‌, జాస్మిన్‌, కేశవలక్ష్మి, భవాని, వనితాజ్యోతి, నాగమణి, స్వప్న, కృష్ణకుమారి, రాణి, గిరిజాకుమారి తదితరులు పాల్గొన్నారు.

దీక్షలో సీపీఎస్‌ఈయూ జిల్లా అధ్యక్షుడు శశిధర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement