ఏ కారణంతోనూ న్యాయం దూరం కావొద్దు.. | - | Sakshi
Sakshi News home page

ఏ కారణంతోనూ న్యాయం దూరం కావొద్దు..

Nov 12 2026 12:19 AM | Updated on Nov 12 2026 12:19 AM

ఖమ్మం లీగల్‌: న్యాయం అనేది కొందరికే కాక అందరికీ చెందాలన్నది వ్యవస్థ ఉద్దేశమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్‌, జిల్లా జడ్జి ఎం.నాగరాజు తెలిపారు. న్యాయ సేవల దినోత్సవాన్ని పురస్కరించుకుని న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యాన బుధవారం నిర్వహించిన అవగాహన ర్యాలీని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఆర్థిక, రాజకీయ, సామాజిక, కారణాలతో ఏ ఒక్కరికి న్యాయం దూరం కావొద్దనేదే న్యాయ సేవా సంస్థ లక్ష్యమని తెలిపారు. న్యాయమూర్తులు వి.సీనయ్య, డాక్టర్‌ మహేష్‌నాథ్‌, సంస్థ కార్యదర్శి దేవీమానస మాట్లాడగా తొలుత న్యాయ సేవా సదన్‌ భవనంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనను జిల్లా జడ్జి నాగరాజు ప్రారంభించారు. న్యాయాధికారులు జ్యోతిర్మయి, అఖిల, ప్యానల్‌ న్యాయవాదులు, వలంటీర్లు, ఉద్యోగులు పాల్గొన్నారు.

అవగాహన ర్యాలీని ప్రారంభించిన

జిల్లా జడ్జి నాగరాజు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement