ఖమ్మంగాంధీచౌక్: కళల వారసత్వాన్ని ప్రతీ తరం కొనసాగించేలా అందరూ పాటుపడాలని అడిషినల్ డీసీపీ రామానుజం సూచించారు. వారధి ఫౌండేషన్, ఖమ్మం డాన్సర్స్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యాన రాష్ట్రస్థాయి ఖమ్మం బాలోత్సవ్ వేడుకలను ఖమ్మంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో బుధవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. మన దేశ కళారూపాలు ప్రపంచవ్యాప్తంగా అందరినీ ప్రభావితం చేస్తున్నందున పిల్లల్లో సజనాత్మకతను వెలికితీసేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని తెలిపారు. తద్వారా సెల్‌ఫోన్‌కు బానిసలు కాకుండా అడ్డుకోవచ్చని చెప్పారు. ఖమ్మం డాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాయల నాగరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వారధి ఫౌండేషన్ చైర్మన్ చింతనిప్పు కష్ణ చైతన్య మాట్లాడుతూ బాలోత్సవంలో పాల్గొనడమే పిల్లలకు గొప్ప విజయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థచైర్మన్ ఖాదర్ బాబా, వైద్యులు కూరపాటి ప్రదీప్, జంగాల సునీల్‌కుమార్, కాటమనేని రాజకుమార్‌తో పాటు ఆర్.ఎన్.ప్రసాద్, లింగం శ్రీనివాసరావు, జైపాల్, చిక్కుళ్ల వెంకటేష్, పగిల్లపల్లి రాజు, ఆర్.ఎన్.ప్రసాద్, రాజేష్, భవానీశంకర్, ముకేశ్, నాని, సతీష్ పాల్గొన్నారు.
అలరించిన చిన్నారుల నృత్యాలు
బాలోత్సవ్‌కు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి విద్యార్థులు హాజరయ్యారు. సుమారు 300 మంది పాల్గొనగా తొలి రోజు సంప్రదాయ విభాగాల్లో బాలబాలికలు ప్రదర్శనలు ఇచ్చారు. ఈ ఉత్సవాలు గురువారం ముగియనుండగా విజేతలకు బహుమతి ప్రదానోత్సవం ఉంటుందని చింతనిప్పు కృష్ణచైతన్య తెలిపారు.
రాష్ట్రస్థాయి ‘బాలోత్సవ్’ను ప్రారంభించిన
అడిషనల్ డీసీపీ రామానుజం


