మధిర: మధిర రైల్వే స్టేషన్ ఆవరణలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ కోదండ రామస్వామి ఆలయ అభివృద్ధికి ప్రభుత్వ ఉపాధ్యాయుడు బూసా కోటేశ్వరరావు బుధవారం రూ. 1,00,116 విరాళం అందించారు. ఈ సందర్భంగా కోటేశ్వరరావు దంపతులను ఆలయ కమిటీ సభ్యులు సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గుర్రం రామారావు, కళ్యాణపు పుల్లారావు తదితరులు పాల్గొన్నారు.
అసోసియేట్ ప్రొఫెసర్‌గా వెంకన్నకు పదోన్నతి
ఖమ్మం స్పోర్ట్స్: ఖమ్మంలోని ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ బి.వెంకన్నకు పదోన్నతి లభించింది. ఆయనకు అసోసియేట్ ప్రొఫెసర్‌గా పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ కమిషనర్ డాక్టర్ యోగితారాణా ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పదోన్నతి దక్కడం ఇదే మొదటిసారి కాగా, వెంకన్నకు పలువురు పీడీలు శుభా కాంక్షలు తెలిపారు.
రేక్ పాయింట్‌కు రూ.2,646 మె.టన్నుల యూరియా
చింతకాని: చింతకాని మండలం పందిళ్లపల్లిలోని రేక్ పాయింట్‌కు కోరమాండల్ కంపెనీకి చెందిన 2,646 మెట్రిక్ టన్నుల యూరి యా బుధవారం చేరింది. ఇందులో నుంచి ఖమ్మం జిల్లాకు 1,046 మె. టన్నులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు 800 మె.టన్నులు, మహబూబాబాద్ జిల్లాకు 700 మె.టన్నులు సరఫరా చేసినట్లు ఖమ్మం డీఏఓ పుల్లయ్య తెలి పారు. మరో వంద మెట్రిక్ టన్నులను బఫర్ స్టాక్‌గా నిల్వ చేశామని వెల్లడించారు.
100 అడుగుల జాతీయ జెండా ఏర్పాటుకు పరిశీలన
నేలకొండపల్లి: మండల కేంద్రంలోని దక్షిణ భారతదేశంలో కెల్లా అతి పెద్దదైన బౌద్ధక్షేత్రం వద్ధ 100 అడుగుల జాతీయ జెండా ఏర్పాటు కు సన్నాహాలు మొదలయ్యాయి. ఐవీఓ సంస్థ ఆధ్వర్యాన ఈ జెండా ఏర్పాటుచేయనుండగా, రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ జి.మధుసూదన్‌రావు బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మట్టి నమూనాల పరీక్షల అనంతరం అనుమతి కోసం దరఖాస్తు చేయనున్నట్లు ఆయన తెలిపారు. సైనికుల సహకారంతో రూపుదిద్దుకునే ఈ ప్రాజెక్ట్ అసియా ఖండంలోనే రెండవని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.
రాష్ట్ర స్థాయి ఎస్‌జీఎఫ్
అథ్లెటిక్స్ పోటీల్లో ప్రతిభ
వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండలోని జవహర్‌లాల్ స్టేడియంలో రెండు రోజులపాటు నిర్వహించిన 70వరాష్ట్రస్థాయి ఎస్‌జీఎఫ్ అండర్–14 బాల బాలికల అథ్లెటిక్స్ పోటీలు బుధవారం ముగిశా యి. పోటీల్లో రంగారెడ్డి జిల్లా ఓవరాల్ చాంపియన్ గా నిలిచింది. అలాగే, బాలుర విభాగంలో ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాలు, బాలికల విభా గంలో రంగారెడ్డి , ఖమ్మం జిల్లా క్రీడాకారులు మొదటి రెండు స్థానాల్లో నిలిచారు. విజేతలకు హనుమకొండ డీవైఎస్‌ఓ కొత్త ప్రశాంత్ బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. అథ్లెటిక్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. సారంగపాణి, ఖేలో ఇండియా కోచ్ మహమ్మద్ గౌస్, నిర్వాహకులు ఏ.ప్రభాకర్‌రెడ్డి, వి.వాసుదేవరావు పాల్గొన్నారు.
ఇటు తెలంగాణ..
అటు ఆంధ్రప్రదేశ్!
●రెండు రాష్ట్రాల సరిహద్దులు గుర్తింపు
ఎర్రుపాలెం: భూముల రీసర్వేలో భాగంగా రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దులను గుర్తించడంలో అధికారులు నిమగ్నమయ్యారు. ఈమేరకు ఎర్రుపాలెం మండలంలోని కేశిరెడ్డిపల్లి, ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండలం గూడెం మాధవరం, పెద్దాపురం గ్రామాల సమీపాన రెండు రాష్ట్రాల అధికారులు సర్వే చేశారు. ఖమ్మం, ఎన్‌టీఆర్ జిల్లాల అధికారులు ధర్మారావు, సాంబశివరావు రికార్డుల ఆధారంగా సరిహద్దులు నిర్ణయించారు. ఈకార్యక్రమంలో తహసీల్దార్ కె సునీత ఎలిజబెత్, రెండు మండలాల ఉద్యోగులు రవికుమార్, రాజశేఖర్, బాలయ్య, పాల్గొన్నారు.


