రుద్రంపూర్: ప్రతీ ఉద్యోగి నైతిక విలువలు పాటించాలని సాఫ్ట్ స్కిల్ ట్రైనర్ ఎన్ఎల్పీ ప్రాక్టీషనర్ కిషోర్ బగాడియా అన్నా రు. కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయంలో బుధవారం విజిలెన్స్ అవగాహన వారోత్సవాలలో భాగంగా రీజియన్‌లోని కొత్తగూడెం, మణుగూరు, ఇల్లెందు, సత్తుపల్లి ఏరియాల అధికారులకు ‘నిజాయితీ ద్వారా సమృద్ధి’ అనే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పారదర్శకతతో కూడిన సేవలు, నిజాయితీతో కూడిన విధానాలు సంస్థల అభివృద్ధికి దోహదపడతాయని అన్నారు. అవినీతి నిర్మూలనకు చేపట్టాల్సిన చర్యలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో జీఎంలు సీహెచ్ శ్రీనివాస్, జి.దేవేందర్, విజయప్రసాద్ మురళీధర్ రాజు, కే.రామ్మోహన్ పాల్గొన్నారు.


