మత్స్యకారులు గల్లంతు కావడం, రక్షించేందుకు వెళ్లిన ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది బోట్ బోల్తా పడినట్లు తెలియగానే కలెక్టర్ దివాకర టీఎస్, అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి చేరుకున్నారు. అలాగే, భద్రాద్రి ఎస్పీ రోహిత్‌రాజ్, సత్తుపల్లి ఎమ్మెల్యే రాగమయి కూడా వచ్చారు. అప్పటికే చీకటి పడడం, వరద ఉధృతితో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. కాగా, వరద హెచ్చరికల నేపథ్యాన సహాయక చర్యల కోసం ముందస్తుగా విజయవాడ నుంచి ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాన్ని ఖమ్మంకు క్రితం రప్పించారు. కలెక్టర్ సూచనలతో ఆ బృందం బేతుపల్లి చెరువు వద్దకు చేరుకుని సహాయక చర్యలను ప్రారంభించింది.


