పోటెత్తిన వేశ్యకాంతల చెరువు | - | Sakshi
Sakshi News home page

పోటెత్తిన వేశ్యకాంతల చెరువు

Nov 5 2026 1:22 AM | Updated on Nov 5 2026 1:22 AM

డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లలోకి వరద

సత్తుపల్లిటౌన్‌: సత్తుపల్లిలోని వేశ్యకాంతల చెరువు బుధవారం రాత్రి అలుగు పోటెత్తడంతో వరద నీరు సమీపంలోని డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లల్లోకి చేరింది. తమ్మినేరు వాగు ఉధృతి కారణంగా వరద వెనక్కి నెట్టి, గ్రౌండ్‌ఫ్లోర్‌లోని ఇళ్లు నీటమునిగా యి. దీంతో ఎమ్మెల్యే డాక్టర్‌ మట్టా రాగమయి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అక్కడ నివసిస్తున్న 96 కుటుంబాలను మున్సిపల్‌ ట్రాక్టర్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరద ఉధృతికి జాతీయ రహదారిపైకి సైతం నీరు చేరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement