డిప్యుటేషన్లు రద్దు చేయాలని వినతి | - | Sakshi
Sakshi News home page

డిప్యుటేషన్లు రద్దు చేయాలని వినతి

Nov 5 2026 1:22 AM | Updated on Nov 5 2026 1:22 AM

ఖమ్మంఅర్బన్‌: జల వనరుల శాఖలో నిబంధనలకు విరుద్ధంగా, కక్షపూరితంగా జారీ చేసిన డిప్యూటేషన్లను రద్దు చేయాలని టీఎన్జీవోస్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గుంటుపల్లి శ్రీనివాసరావు, కొణిదెన శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. ఈమేరకు బుధవారం ఖమ్మంలో సీఈ వాసంతికి వినతిపత్రం అందజేసి మాట్లాడారు. పదోన్నతిపై బాధ్యతలు చేపట్టిన కొద్దికాలానికే గెజిటెడ్‌, నాన్‌గెజిటెడ్‌, నాలుగో తరగతి, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు ఇష్టానుసారంగా డిప్యూటేషన్లు ఇస్తున్నారని పేర్కొన్నారు. కల్లూరు సర్కిల్‌ జూనియర్‌ అసిస్టెంట్‌ మాతంగి రవిని తొలుత ఏన్కూరు సబ్‌డివిజన్‌కు డిప్యుటేషన్‌పై పంపి, అనంతరం కొత్తగూడెం క్వాలిటీ కంట్రోల్‌ సబ్‌డివిజన్‌కు బదిలీ చేశారని తెలిపారు. అలాగే సత్తుపల్లి డివిజన్‌ ఔట్‌సోర్సింగ్‌ డీఈఓ రమేష్‌ను ఖమ్మం ప్రధాన కార్యాలయానికి పంపారని పేర్కొన్నారు. ఉద్యోగుల వ్యక్తిగత, కుటుంబ పరిస్థితులను పరిగణనలోకి తీసుకోకుండా జారీ చేస్తున్న ఉత్తర్వులను రద్దు చేసి ఉద్యోగులకు న్యాయం చేయాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement