చిన్నారి ప్రాణానికి పెద్దకష్టం | - | Sakshi
Sakshi News home page

చిన్నారి ప్రాణానికి పెద్దకష్టం

Nov 5 2026 1:22 AM | Updated on Nov 5 2026 1:22 AM

● అరుదైన వ్యాధి చికిత్సకు రూ.22 లక్షలు అవసరం ● దాతలు చేయూత ఇవ్వాలని కుటుంబం వేడుకోలు

● అరుదైన వ్యాధి చికిత్సకు రూ.22 లక్షలు అవసరం ● దాతలు చేయూత ఇవ్వాలని కుటుంబం వేడుకోలు

నేలకొండపల్లి: ఓ చిన్నారి ప్రాణాపాయ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతోంది. అరుదైన వ్యాధి బారిన పడిన బాలిక చికిత్సకు రూ.22లక్షల అవసరమని చెప్పడంతో నిరుపేద కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది. దాతలు దయతలచి తమ బిడ్డ ప్రాణాలు కాపాడాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

పుట్టుకతో వచ్చే సమస్య

నేలకొండపల్లికి చెందిన కొత్తా రవీందర్‌ సాధారణ మెకానిక్‌గా జీవనం సాగిస్తున్నాడు. ఆయన కుమార్తె మహాన్య కొన్నాళ్ల క్రితం అనారోగ్యం బారిన పడడంతో ఆస్పత్రిలో చూపించగా.. ‘కోలెడోచల్‌ సిస్ట్‌’ సమస్యతో బాధపడుతున్నట్లు తేలింది. తద్వారా కాలేయం నుంచి పిత్తాశయం, చిన్న పేగులకు జీర్ణ సంబంధిత పైత్యరసాన్ని తీసుకుకెళ్లే పైత్య వాహికలు అసాధారణంగా విస్తరించడం లేదా బెలూన్‌లా ఉబ్బడం వల్ల వచ్చే అరుదైన సమస్యగా గుర్తించారు. దీంతో రవీందర్‌ తన స్థాయికి మించి అందినకాడికల్లా అప్పులు తెచ్చి వైద్యం చేయించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో మహాన్యను చేర్పించగా, చికిత్స, ఇతర వైద్య ఖర్చుల కోసం దాదాపు రూ.22 లక్షల వరకు అవసరమని వైద్యులు తెలిపారు. ఇంత డబ్బు ఎలా సమకూర్చుకోవాలో తెలియక రవీందర్‌ కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది. తమ బిడ్డను కాపాడుకునేందుకు దాతలు చేయూతనివ్వాలని కోరుతున్నారు. ఆర్థిక సాయం చేయాలనుకునే వారు 97054 75820 నంబర్‌కు ఫోన్‌ పే చేయాలని రవీందర్‌ విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement