● డిసెంబర్‌లో ‘మార్చ్‌ టు గోడౌన్‌’ ● అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి వెంకట్‌ | - | Sakshi
Sakshi News home page

● డిసెంబర్‌లో ‘మార్చ్‌ టు గోడౌన్‌’ ● అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి వెంకట్‌

Nov 5 2026 1:22 AM | Updated on Nov 5 2026 1:22 AM

● డిసెంబర్‌లో ‘మార్చ్‌ టు గోడౌన్‌’ ● అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి వెంకట్‌

గోదాంల్లోని బియ్యం పేదలకు పంచుతాం

ఖమ్మంమయూరిసెంటర్‌: దేశంలో గత 50ఏళ్లలో లేనంత తీవ్రమైన కరువు పరిస్థితులు నెలకొన్నందున పాలకులు వెంటనే కరువు సహాయక చర్యలు చేపట్టాలని, లేనిపక్షంలో వచ్చేనెల ‘మార్చ్‌ టు గోడౌన్‌’ పేరిట గోదాంలను బద్దలుకొట్టి పేద ప్రజలకు బియ్యం పంపిణీ చేస్తామని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌ వెల్లడించారు. ఖమ్మంలోని సుందరయ్య భవన్‌లో బుధవారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎల్‌నినో వల్ల కొంత కరువు ఏర్పడితే, ప్రభుత్వాల నిర్లక్ష్యం, తప్పుడు విధానాలతో అది తీవ్రమైందని చెప్పారు. కరువు నివారణ, సహాయక చర్యల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే రూ.2 లక్షల కోట్లు కేటాయించి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు నిత్యావసర సరుకుల కోటా రెట్టింపు చేయాలని డిమాండ్‌ చేశారు. ఎఫ్‌సీఐ గోదాంల్లో 6కోట్ల టన్నుల ధాన్యం నిల్వలు ఉన్నా ఇవ్వకుండా, ప్రధాని మోదీ, సీఎం రేవంత్‌రెడ్డి కార్పొరేట్‌ కంపెనీలకు కొమ్ముకాస్తూ ధరల పెంపునకు సహకరిస్తున్నారని ఆరోపించారు. కాగా, ‘సర్‌’కు వ్యతిరేకంగా, జ్ఞానేష్‌కుమార్‌ రాజీ నామా డిమాండ్‌తో సుదీర్ఘ పోరాటం కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఇక దేశంలో వ్యవసాయ రంగాన్ని మోదీ ప్రభుత్వం కార్పొరేట్‌ కంపెనీలకు కట్టబెట్టేలా రైతులకు ఇచ్చే సబ్సిడీల్లో కోత విధిస్తోందని ధ్వజమెత్తారు. కాగా, ఈనెల 15న నల్లగొండలో జరిగే అఖిల భారత రైతు సంఘం మహాసభలకు తెలంగాణ నుండి లక్ష మంది రైతులు, వ్యవసాయ కార్మికులు పాల్గొననున్నారని వెల్లడించారు. వచ్చే ఫిబ్రవరి 14 నుండి 17 వరకు బెంగళూరులో వ్యవసాయ కార్మిక సంఘం అఖిల భారత మహాసభలు జరగనున్నాయని తెలిపారు. సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పొన్నం వెంకటేశ్వరరావు, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మెరుగు సత్యనారాయణ, యర్రా శ్రీనివాసరావు, నాయకులు పడిగల నాగేశ్వరరావు, సారంగి పాపారావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement