చికిత్స పొందుతున్న మహిళ మృతి | - | Sakshi
Sakshi News home page

చికిత్స పొందుతున్న మహిళ మృతి

Nov 5 2026 1:22 AM | Updated on Nov 5 2026 1:22 AM

చికిత్స పొందుతున్న మహిళ మృతి ఉదయం రెక్కీ... రాత్రి చోరీ

పెనుబల్లి: మండలంలోని లంకపల్లిలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన పుచ్చకాయల తులసమ్మ( 50) చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. ఆమె కూలీ పనులకు వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా లంకపల్లి సెంటర్‌లో ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఘటనలో తీవ్రంగా గాయపడిన తులసమ్మకు ఖమ్మంలో చికిత్స చేయిస్తుండగా బుధవారం మృతి చెందింది. ఆమెకు ఓ కుమార్తె, కుమారుడు ఉండగా, వీఎం బంజర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

అంతర్‌ జిల్లా ముఠా అరెస్ట్‌

ఖమ్మం క్రైం: తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించేందుకు పొద్దంతా కారులో తిరుగుతూ రెక్కీ నిర్వహించడం.. ఎంపిక చేసుకున్న ఇళ్లలో రాత్రివేళ చోరీలకు పాల్పడుతున్న అంతర్‌ జిల్లా ముఠాను ఖమ్మం సీసీఎస్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. గత ఐదు నెలలుగా ఈ ముఠా ఖమ్మం, మహబూబాబాద్‌ జిల్లాల్లోని పలు ప్రాంతాలకు చోరీకి పాల్ప డినట్లు గుర్తించారు. ఈ మేరకు అడిషనల్‌ డీసీపీ రామానుజం బుధవారం వివరాలు తెలిపారు. ఖమ్మంకు చెందిన చల్లా వెంకటేశ్వర్లు, పాయన నవీన్‌, వాజేడుకు చెందిన వేములవాడ జీవనప్రకాష్‌ కలిసి విలాసవంతమైన జీవి తానికి అలవాటు పడి చోరీలు మొదలు పెట్టారు. ఖమ్మం జిల్లాలోని వైరా, ఏన్కూరు, కల్లూరు, కారేపల్లితో పాటు మహబూబాబాద్‌ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడగా కేసులు నమోదు నమోదయ్యాయి. ఈమేరకు సీపీఎస్‌ ఏసీపీ సర్వర్‌, సీఐలు రాజ్‌కుమార్‌ గౌడ్‌, వంశీకృష్ణ నిఘా వేయగా వారం క్రితం ఇద్దరు పట్టుబడ్డారు. ఈ బృందం నాయకుడు వెంకటేశ్వర్లును బుధవారం అరెస్ట్‌ చేయగా, ఒక కారు, యాభై గ్రాముల బంగారం, 400గ్రాముల వెండిం స్వాధీనం చేసుకున్నట్లు అడిషనల్‌ డీసీపీ తెలిపారు. ఈ సందర్భంగా ఏసీపీ సీఐ, ఎస్సైలతో పాటు ఉద్యోగులు వేణు, ఓంప్రకాష్‌, హరికృష్ణ, సుధీర్‌, నరసింహారావు, మంగిత్యా, జానీ, శ్రీధర్‌, సతీష్‌, సుందరం, నర్సింహారావును ఆయన అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement