న్యాయమూర్తి బిందుప్రియ బదిలీ | - | Sakshi
Sakshi News home page

న్యాయమూర్తి బిందుప్రియ బదిలీ

Nov 4 2026 1:32 AM | Updated on Nov 4 2026 1:32 AM

ఖమ్మం లీగల్‌: ఖమ్మం రెండో అదనపు ప్రథమ శ్రేణి కోర్టు న్యాయమూర్తి ఏపూరి బిందుప్రియ బదిలీ అయ్యారు. ఆమెను మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట జూనియర్‌ సివిల్‌ జడ్జిగా బదిలీ చేస్తూ హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ నుంచి మంగళవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.

పొగాకు రహిత సమాజ నిర్మాణానికి కృషి

ముదిగొండ: పొగాకు రహిత సమాజ నిర్మాణానికి ప్రతీఒక్కరు పాటుపడాలని జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ అరుణాదేవి సూచించారు. ముదిగొండ ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలో మంగళవారం ఏర్పాటుచేసిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. పొగాకు వినియోగంతో యువత భవిష్యత్‌ను నాశనం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. పొగాకు ఉత్పత్తుల వినియోగంతో కేన్సర్‌ బారిన పడే ప్రమాదముందన్నందున అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. వైద్యాధికారులు సోహెల్‌, సత్యనారాయణ, కాలేజీ ప్రిన్సిపాల్‌ శ్రీనివాసరావు, అధ్యాపకులు, ఉద్యోగులు టి.ఉష, నాగేంద్రప్రసాద్‌, మధుసూదన్‌, వసంత పాల్గొన్నారు.

నవజాత శిశు రక్షణపై అవగాహన

రఘునాథపాలెం: నవజాత శిశువుల ఆరోగ్య పరిరక్షణపై ఆశా కార్యకర్తలు అవగాహన కలిగి ఉండి, ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా వ్యాక్సిన్‌ మేనేజర్‌ సీహెచ్‌.వెంకటరమణ సూచించారు. రఘునాథపాలెం మండలం మంచుకొండ పీహెచ్‌సీ పరిధి మంచుకొండ, బాలాజీనగర్‌ పీహెచ్‌సీలను మంగళవారం ఆయన తనిఖీ చేసి మాట్లాడారు. ఆశా కార్యకర్తలు వారి పరిధిలోని గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువుల ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని తెలిపారు. గృహ సందర్శనల ద్వారా గర్భిణులు, బాలింతలకు జాగ్రత్తలపై అవగాహన కల్పించాలన్నారు. శిశువుల్లో ప్రమాద సంకేతాలను గుర్తించగానే ఆలస్యం చేయకుండా ఆస్పత్రులకు తరలించాలని తెలిపారు. సకాలంలో వ్యాధి లక్షణాల గుర్తింపు, ఆస్పత్రులకు సిఫారసు, ఆపై వైద్యం అందించడం ద్వారా మాతా, శిశు మరణాలను తగ్గించవచ్చని పేర్కొన్నారు. అలాగే, ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు జాతీయ ఆరోగ్య కార్యక్రమాల్లో వందశాతం లక్ష్య సాధనకు కృషి చేయాలని సూచించారు. ఈ సమావేశాల్లో వైద్యులు రంజిత్‌, మోనిక, శృతి, సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.

‘ఆయిల్‌ఫెడ్‌’లో

ఉద్యోగ నియామకాలు

పోస్టుల భర్తీకి అనుమతించిన ఆర్థికశాఖ

అశ్వారావుపేటరూరల్‌: తెలంగాణ సహకార నూనె గింజల సమాఖ్య లిమిటెడ్‌(టీజీ ఆయిల్‌ఫెడ్‌)లో దశాబ్దం తర్వాత ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ మేరకు జీవో 1712 ద్వారా గత నెల 31న ఉత్తర్వులు జారీచేసింది. సంస్థలో ఖాళీలను భర్తీ చేయాలన్న ప్రతిపాదనలతో నియామకాలకు అనుమతించింది. నియామకం పూర్తయితే ఆయిల్‌ఫెడ్‌లో ఉద్యోగుల కొరత చాలా వరకు తీరనున్నది.

భర్తీ చేసే పోస్టులు ఇవే

ఆయిల్‌ఫెడ్‌లో ఏళ్లుగా ఖాళీగా ఉన్న డిప్యూటీ మేనేజర్‌(ఎం.టెక్‌ –ఒక పోస్టు), డిప్యూటీ మేనేజర్‌(అగ్రి–ఒక పోస్టు), ఏఈఈ(మెకానికల్‌– ఆరు), కెమిస్ట్‌(ఒకటి), ఎగ్జిక్యూటివ్‌ (జనరల్‌–4), జూనియర్‌ ఆపరేటర్‌(4), జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ (9), ఫీల్డ్‌ ఆఫీసర్లు(3) చొప్పున భర్తీకి అనుమతులు వచ్చాయి. ఈ పోస్టులన్నీ వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి భర్తీ చేసేలా ఉత్తర్వులు జారీ అయ్యాయి. వీటిని కాంట్రాక్ట్‌ పద్ధతిలో నియమించనున్నారు. మరో 73 పోస్టులు శాశ్వత విధానంలో భర్తీకి అనుమతి ఇవ్వగా, రెగ్యులర్‌ పోస్టులను రాత పరీక్ష ద్వారా ఎంపికచేసే బాధ్యతను జేఎన్‌టీయూకి అప్పగించారు. దీనికి సంబంధించి త్వరలోనే నోటీఫికేషన్‌ రానున్నట్లు సమాచారం. కాగా, ఔట్‌ సోర్సింగ్‌ ద్వారా నియమితులయ్యే ఉద్యోగులకు ఆయిల్‌ ఫెడ్‌ సంస్థ సొంత నిధుల నుంచే వేతనాలు చెల్లించాల్సి ఉంటుంది. దశాబ్ద కాలం తర్వాత రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవతో ఉద్యోగాల భర్తీకి అనుమతులు రావడం పట్ల ఆయిల్‌పాం రైతు సంఘం బాధ్యులు హర్షం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement