నలుగురికి తీవ్ర గాయాలు
చర్ల: ఆగి ఉన్న ఆటోలో నుంచి ప్రయాణికులు దిగుతున్న క్రమంలో వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో ఆటోలో ఉన్న నలుగురికి తీవ్ర గాయాలు, మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన ఆదివారం దుమ్ముగూడెం మండలంలోని చిననల్లబల్లి, కేశవాపురం గ్రామాల మధ్యలో జరిగింది. చర్ల మండలంలోని పులిగుండాల గ్రామానికి చెందిన కొందరు ఆటోలు చిననల్లబల్లి కేశవాపురం మధ్యలో ఉన్న చర్చిలో ఆదివారం ప్రార్థనకు వెళ్లారు. చర్చి ముందున్న రహదారి పక్కన ఆటో ఆపి దిగుతుండగా హైదరాబాద్ నుంచి వస్తున్న కారు ఢీకొట్టింది. దీంతో పులిగుండాలకు చెందిన మైనిక, వీరమ్మ, భద్రయ్య, సీతారాములకు తీవ్ర గాయాలయ్యాయి. మరికొందరికి స్వల్ప గాయాలయ్యా యి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ములకపాడు, భద్రాచలం ఆస్పత్రులకు తరలించారు. కాగా, ఈ ఘటనపై ఫిర్యాదు అందలేదని సీఐ వెంకటప్పయ్య తెలిపారు.
పరిష్కారానికి నోచుకోని ప్రజా సమస్యలు
భద్రాచలంటౌన్: భద్రాచలం నియోజకవర్గంలో ప్రజా సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి కనగాల చైతన్య విమర్శించారు. ఆదివారం పట్టణంలోని హరి త హోటల్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను విస్మరించాయని ఆరోపించారు. భద్రాచలంలో డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న పేదలు ఎదురుచూపులు చూస్తున్నారని పేర్కొన్నారు. బూర్గంపాడు రహదారిని అభివృద్ధి చేయాలని, చర్ల–వెంకటాపురం రహదారి సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని, దుమ్ముగూడెం ప్రాంత రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు.
టీఆర్‌ఎస్ రాష్ట్ర మహిళా ప్రధాన
కార్యదర్శి కనగాల చైతన్య


