వరంగల్ – ఖమ్మం – నల్లగొండ శాసనమండలి
పట్టభద్రుల స్థానానికి ఓటరు నమోదు గడువు
సమీపిస్తోంది. ఓటర్ల నమోదుకు సెప్టెంబర్ 28న
నోటిఫికేషన్ జారీ చేయగా, తొలుత పట్టభద్రులు ఆసక్తి చూపారు. ఆ తర్వాత పెద్దగా ముందుకు రాకపోవడంతో ఇప్పటి వరకు జిల్లాలో 78,074 దరఖాస్తులే అందాయి. నమోదుకు నవంబర్ 6వ తేదీ వరకే గడువు ఉండడంతో రాజకీయ పార్టీల ఆధ్వర్యాన ప్రత్యేక శిబిరాలు
ఏర్పాటుచేసి పట్టభద్రులను కలుస్తున్నారు.
– సాక్షి ప్రతినిధి, ఖమ్మం


