రేక్‌ పాయింట్‌కు 1,319 మె.టన్నుల యూరియా | - | Sakshi
Sakshi News home page

రేక్‌ పాయింట్‌కు 1,319 మె.టన్నుల యూరియా

Oct 31 2026 6:08 AM | Updated on Oct 31 2026 6:08 AM

చింతకాని: చింతకాని మండలం పందిళ్లపల్లిలోని రేక్‌ పాయింట్‌కు క్రిబ్‌కో కంపెనీకి చెందిన 1,319.40 మెట్రిక్‌ టన్నుల యూరియా శుక్రవారం చేరింది. ఈ మేరకు కోటా వారీగా ఖమ్మం జిల్లాకు 519.40 మె. టన్నులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు 500 మె. టన్నులు, మహబూబాబాద్‌ జిల్లాకు 200 మె. టన్నులు సరఫరా చేశామని ఖమ్మం డీఏఓ డి.పుల్లయ్య తెలిపారు. మరో 100 మెట్రిక్‌ టన్నుల యూరియా బఫర్‌ స్టాక్‌గా నిల్వ చేశామని వెల్లడించారు.

నేటి నుంచి రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్‌ టోర్నీ

ఖమ్మం స్పోర్ట్స్‌: రాష్ట్రస్థాయి జూనియర్‌ బాలికల హ్యాండ్‌బాల్‌ చాంపియన్‌షిప్‌ పోటీలు ఖమ్మంలో శనివారం నుంచి మూడు రోజుల పాటు జరగనున్నాయి. ఖమ్మం సర్దార్‌ పటేల్‌ స్టేడియంలో జరిగే పోటీలకు రాష్ట్రంలో పది ఉమ్మడి జిల్లాల నుంచి జట్లు హాజరుకానున్నాయి. లీగ్‌ కం నాకౌట్‌ పద్ధతిలో జరిగే మ్యాచ్‌ల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తిచేశామని, ఫ్లడ్‌ లైట్ల వెలుతురులో మ్యాచ్‌లు జరుగుతాయని హ్యాండ్‌బాల్‌ అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి వరికూటి మోహన్‌ తెలిపారు. అసోసియేషన్‌ నూతన కార్యవర్గం ఏర్పడ్డాక తొలిసారి ఈ పోటీలు జరుగుతున్నాయి.

శ్రీనిధి బకాయిలు

వంద శాతం రికవరీ

కామేపల్లి: మహిళా సంఘాల సభ్యులు తీసుకున్న శ్రీనిధి రుణాలను వంద శాతం వసూలు చేసేలా అధికారులు, సిబ్బంది చొరవ చూపాలని శ్రీనిధి రీజనల్‌ మేనేజర్‌ రవీందర్‌నాయక్‌ సూచించారు. కామేపల్లిలోని అజంతా మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో శ్రీనిధి రుణాలు, వసూళ్లపై శుక్రవారం ఆయన సమీ క్షించారు. సభ్యుల పురోగతికి తోడ్పడుతున్న శ్రీనిధి రుణాల చెల్లింపుల్లో జాప్యం జరగకుండా అవగాహన కల్పించాలని తెలిపారు. ఎక్కు వ బకాయిలు ఉన్న ప్రాంతాలపై కమ్యూనిటీ కోఆర్డినేటర్లు, విలేజ్‌ ఆర్గనైజేషన్‌ అసిసెంట్లు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సంఘాల వారీగా బకాయిలను పరిశీలిస్తూ సభ్యులతో మాట్లాడి సకాలంలో చెల్లించేలా చైతన్యపరుస్తూ వంద శాతం లక్ష్యాన్ని సాధించాలని ఆర్‌ఎం స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం వెంకటరామారావు, వీఓఏ, సీసీలు పాల్గొన్నారు.

రైతుల ఖాతాల్లోకి

కేంద్ర పెట్టుబడి సాయం

ఖమ్మంవ్యవసాయం: ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ యోజన 24వ విడత నిధులు శుక్రవా రం విడుదలయ్యాయి. పీఎం నరేంద్రమోదీ గుజరాత్‌లోని బనస్కంత నుంచి దేశవ్యాప్తంగా రైతులకు నిధులు విడుదల చేశారు. ఏటా అర్హులైన రైతులు ఎకరాకు రూ.6 వేల చొప్పున విడతకు రూ.2 వేలు ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఈ విడత జిల్లాలో 1.03 లక్షల మంది రైతుల ఖాతా ల్లో రూ.20.68 కోట్లు జమ అయ్యే అవకాశం ఉన్నట్లు వ్యవసాయ శాఖ తెలిపింది. కాగా, నిధుల విడుదల కార్యక్రమాన్ని జిల్లాలోని 62 రైతు వేదికల్లో ప్రత్యక్ష ప్రసారం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement