కోటమైసమ్మతల్లి జాతర ఆదాయం రూ.32 లక్షలు | - | Sakshi
Sakshi News home page

కోటమైసమ్మతల్లి జాతర ఆదాయం రూ.32 లక్షలు

Oct 27 2026 12:38 AM | Updated on Oct 27 2026 12:38 AM

కారేపల్లి: దసరా సందర్భంగా మండలంలోని ఉసిరికాయపల్లిలో నిర్వహించిన శ్రీకోటమైసమ్మతల్లి జాతర ఆదివారం ముగిసింది. ఈ మేరకు సోమవారం ఆలయ సత్రంలో దేవాదాయ శాఖ ఇన్‌స్పెక్టర్‌ సమత, ఈఓ కట్టుకూరు వెంకటయ్య , పర్సా ట్రస్టు చైర్మన్‌ పట్టాభిరామారావు సమక్షాన హుండీ ఆదాయాన్ని లెక్కించారు. ఐదు రోజుల పాటు జరిగిన జాతర సందర్భంగా మొత్తం రూ.32,02,697 ఆదాయం నమోదు కాగా, హుండీల ద్వారా రూ.8,02,366 కానుకలు వచ్చాయని అధికారులు వెల్లడించారు. గత ఏడాది జాతర ఆదాయం రూ.29,10,386 కాగా, ఈ ఏడాది రూ.2,92,311 పెరిగింది. హుండీల ద్వారా గత ఏడాది రూ.7,41,764 కానుకలు వస్తే ఈసారి రూ.20,602 పెరిగి రూ.8,02,366గా నమోదైంది. జాతరలో పూజా టికెట్ల ద్వారా గత ఏడాది రూ.4,95,290 వస్తే ఈ ఏడాది రూ.6,34,350, వేలం హక్కుల ద్వారా గత ఏడాది రూ.9,64,500 ఆదాయం రాగా, ఈ ఏడాది రూ.10,96,000 సమకూరింది. దేవాదాయ శాఖ అధికారులు పగడాల మోహన్‌కృష్ణ, పర్సా సాయిలలిత్‌, మూడ్‌ మోహన్‌చౌహాన్‌, గణితి నారాయణ, సర్పంచ్‌ వరలక్ష్మిరాజు, గ్రామ కార్యదర్శి భూక్యా నిరంజన్‌, గ్రామస్తులు బోడ బన్సీలాల్‌, ఇస్లావత్‌ శంకర్‌ పాల్గొన్నారు.

గత ఏడాది కంటే రూ.2.92లక్షలు ఎక్కువ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement