ఖమ్మం సహకారనగర్: ప్రజావాణిలో అందే ప్రతీ దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో భాగంగా ఆమె దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం అధికారులతో సమావేశమై ఇప్పటివరకు పెండింగ్ ఉన్న దరఖాస్తులు, వాటి స్థితిగతులపై సమీక్షించి సూచనలు చేశారు.
ఫిర్యాదుల్లో కొన్ని...
వేంసూరుకు చెందిన డి.అపర్ణ దివ్యాంగురాలినైన తనకు ఉపాధి కల్పించాలని కోరారు. అలాగే, ఖమ్మంకు చెందిన మహమ్మద్ అబ్దుల్ కరీం టీ హబ్ డయాగ్నస్టిక్ కేంద్రంలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేసిన తాను 2024 జనవరిలో ఉద్యోగం కోల్పోయానని తెలిపారు. తిరిగి ఉపాధి కల్పించాలని వినతిపత్రం అందజేశారు. ఖమ్మంకు చెందిన ట్రాన్స్‌జెండర్ ఎస్.కే.నమ్రీన్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగం కల్పించాలని దరఖాస్తు అందజేయగా, వైఎస్సార్ కాలనీకి చెందిన ఎం.రోజా తన భర్త వేధింపుల నుంచి రక్షణ కల్పించాలని వినతిపత్రం అందజేసింది.
‘ప్రజావాణి’లో అదనపు కలెక్టర్ శ్రీజ


