రఘునాథపాలెం: ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితి నెలకొన్నందున రైతులు యాసంగి సాగుపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య సూచించారు. తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. రఘునాథపాలెం మండలం చింతగుర్తిలో సోమవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. సాగునీటిని పొదుపుగా వినియోగించుకోవాలని, నేలలో తేమను సంరక్షించే పద్ధతులు పాటించాలని చెప్పారు. శాసీ్త్రయ సాగు పద్ధతులతో దిగుబడి, ఆదాయం పెరుగుతుందని తెలిపారు. వ్యవసాయ విస్తరణ అధికారి బాలబత్తుల శిరిణ్మయి తదితరులు పాల్గొన్నారు.


