ఎల్‌నినోపై ఉపాధి అస్త్రం ! | - | Sakshi
Sakshi News home page

ఎల్‌నినోపై ఉపాధి అస్త్రం !

Oct 26 2026 12:16 AM | Updated on Oct 26 2026 12:16 AM

న్యూస్‌రీల్‌

వచ్చే ఏడాది జూన్‌ వరకు నిరంతర పనులు జిల్లాలో రెండు కోట్ల పనిదినాలే లక్ష్యం

జిల్లాలో జాబ్‌కార్డులు, పనిదినాలు

సోమవారం శ్రీ 26 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026

సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఎల్‌నినో విపత్కర పరిస్థితుల నేపథ్యాన వ్యవసాయ పనులు తగ్గిపోవడంతో కూలీలకు ఉపాధి ఇక్కట్లు ఎదురు కానున్నాయి. ఈమేరకు ప్రభుత్వం వీబీ–జీ రామ్‌జీ(వికసిత్‌ భారత్‌ – గ్యారెంటీ ఫర్‌ రోజ్‌గార్‌, అజీవిక మిషన్‌–గ్రామీణ్‌) పథకం ద్వారా గ్రామీణ ప్రాంత కూలీల కు భరోసా ఇచ్చేలా సిద్ధమవుతోంది. ఈ నెల నుంచి వచ్చే ఏడాది జూన్‌ వరకు గ్రామీణ కూలీలకు నిరంతరం పని కల్పించడమే లక్ష్యంగా ప్రత్యేక గ్రామ సభలను ఏర్పాటుచేసి పనులను గుర్తించడమే కాక కొత్తగా 3,209 కుటుంబాలకు జాబ్‌కార్డులు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

కరువు ఛాయలు

వర్షాకాలం సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా సాధారణ వర్షపాతం కూడా నమోదు కాలేదు. దీంతో భూగర్భ జలాలు పడిపోగా కరువు ఛాయలు అలుముకున్నాయి. ఇప్పటికే 17 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని ప్రభుత్వానికి యంత్రాంగం నివేదిక సమర్పించింది. మరోపక్క యాసంగిలో పంటలు సాగు చేయవద్దని ప్రభుత్వం ప్రకటించింది. ఈక్రమాన వ్యవసాయ పనులు లేక నష్టపోయే కూలీలకు వీబీజీ రామ్‌జీ ద్వారా భరోసా కల్పించేందుకు యంత్రాంగం సిద్ధమవుతోంది.

గ్రామసభల్లో పనుల గుర్తింపు

గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఉపాధి పనులకు ప్రణాళిక రూపొందించారు. జిల్లాలోని 571 గ్రామపంచాయతీల్లో నిర్వహించిన ప్రత్యేక గ్రామసభల్లో 4,360 మంది గ్రామస్తులు, 2,632 మంది అధికారులు, 2,989 మంది లైన్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారులు పాల్గొని పనుల గుర్తింపు చేపట్టారు. ఇప్పటికే జాబ్‌ కార్డులు ఉన్న కూలీలతో పాటు కొత్త కార్డుదారులకు రాబోయే ఎనిమిది నెలల్లో కొరత రాకుండా పనుల కల్పనకు వీబీజీ రామ్‌జీ పథకం ద్వారా భారీగా పనిదినాలు కేటాయించారు. మొత్తం 2,06,60,454 పనిదినాలు అవసరమని గుర్తించారు.

నీటి నిల్వ పనులకే ప్రాధాన్యత

జిల్లాలో నీటి కొరత నేపథ్యాన భూగర్భ జలాల పెంపు, నీటి నిల్వల పనులకే వీబీజీ రామ్‌జీ పథకంలో ప్రాధాన్యత ఇస్తున్నారు. ఊట చెరువుల పూడికతీత, కాల్వల మరమ్మతులు, కొత్త బావుల తవ్వకం వంటి పనులకు గుర్తించారు. తద్వారా నిరుపేద కుటుంబాలకు ఆర్థిక లబ్ధి చేకూరడమే కాక చెరువులు, కాల్వల పునరుద్ధరణ జరిగి భూగర్భ జలాలు పెరుగుతాయని భావిస్తున్నారు. అలాగే జలసిరి ద్వారా ఇంకుడు గుంతలు, ఫామ్‌పాండ్స్‌, నీటికుంటలు, బోర్‌వెల్‌ రీచార్జి స్ట్రక్చర్ల నిర్మాణాల ద్వారా 9,54,173 పనిదినాలు కల్పించేలా ప్రనాళిక రూపొందించారు. కేటగిరీ – 1, 2, 3, 4 కింద చేపట్టే పనులకు సంబంధించి పనిదినాలు అందుబాటులో ఉన్నాయని గ్రామసభల్లో వెల్లడించారు.

వీబీజీ రామ్‌జీ పథకంతో కూలీలకు ఆసరా

మొత్తం జాబ్‌ కార్డులు 2,93,131

యాక్టివ్‌ కార్డులు 1,65,276

కొత్తగా కార్డులు తీసుకున్న కుటుంబాలు 3,203

పనిదినాల లక్ష్యం 2,06,60,454

అందుబాటులో ఉన్న పనిదినాలు 1,16,43,196

ఇంకా గుర్తించాల్సినవి 90,17,258

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement