‘అమృత్‌’ ఫలాలు అందేనా ? | - | Sakshi
Sakshi News home page

‘అమృత్‌’ ఫలాలు అందేనా ?

Oct 26 2026 12:16 AM | Updated on Oct 26 2026 12:16 AM

● పనులు జరుగుతున్నాయి.. మున్సిపాలిటీల వారీగా పనులు ఇలా.. రిజర్వాయర్‌ నీరే శరణ్యం

మూడు మున్సిపాలిటీల్లో నత్తకడకన పనులపై ఆందోళన మూడేళ్లక్రితం మొదలైనా కానరాని పురోగతి

వైరా మున్సిపల్‌ పరిధిలో మూడు ట్యాంక్‌ల నిర్మాణం జరుగుతోంది. ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ నిర్మాణానికి కూడా ప్రతిపాదనలు చేశాము. తాగునీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటాం.

– శ్రీమాన్య, మున్సిపల్‌ ఏ.ఈ, వైరా

వైరా: మున్సిపాలిటీల్లో తాగునీటి వసతిని మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం ‘అమృత్‌ – 2.0’ పథకం ద్వారా నిధులు కేటాయించింది. అయితే, జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో మూడేళ్ల క్రితం పనులు ప్రారంభించినా ఇప్పటి వరకు పూర్తికాకపోగా ఇంకా ఎన్నాళ్లు పడుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. ఎల్‌నినో నేపథ్యాన ఓ వైపు భూగర్భజలాలు అడుగంటిపోతుండడంతో తాగునీటికి ఇబ్బంది రాకుండా చూడాల్సిన అధికారులు పట్టించుకోకపోవడమే ఈ పరిస్థితి కారణమన్న విమర్శలు వస్తున్నాయి. ఓ వైపు ప్రభుత్వం సాగు అవసరాలకు నీరు ఇచ్చే పరిస్థితి లేదని.. ఉన్న వనరులను తాగునీటి అవసరాలకు పొదుపుగా వాడుకోవాలని సూచిస్తోంది. అయితే, క్షేత్రస్థాయిలో ఉన్న నీటిని సక్రమంగా సరఫరా చేసేలా పనులు జరగకపోవడం విమర్శలకు తావిస్తోంది.

●సత్తుపల్లి మున్సిపాలిటీలో మొత్తం 23 కిలోమీటర్ల మేర పైపులైన్‌కు గాను ఆరు కి.మీ. మేర ఇంట్రా పైపులైన్‌ పనులు పెండింగ్‌లో ఉన్నాయి. మొత్తం 12 ట్యాంకులు ఉన్నప్పటికీ పెండింగ్‌ పనులు పూర్తి కాకపోతే తాగునీటి ఇబ్బందులు తప్పేలా లేవు.

●మధిర మున్సిపాలిటీలో 10 కిలోమీటర్ల మేర పైపులైన్‌ నిర్మించాల్సి ఉంది. ఇందులో మూడు కి.మీ. పెండింగ్‌ ఉండగా.. అధికారులు 80 శాతం పూర్తయినట్లు చెబుతున్నారు. ఇక్కడ ఎనిమిది ట్యాంకుల నిర్మాణానికి గాను రెండు ట్యాంకుల నిర్మాణం పూర్తికాలేదు.

●వైరా మున్సిపాలిటీ పరిధిలో 24 కి.మీ. మేర పైపులైన్ల నిర్మాణం జరగాల్సి ఉండగా మరో కి.మీ. పైపులైన్‌ పూర్తయిన చోట కూడా కనెక్షన్లు ఇవ్వలేదు. వైరాలోని సంతబజార్‌, పల్లిపాడు శివారు గ్రామంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వెనకాల ట్యాంకుల నిర్మాణ పనులు రెండేళ్లుగా ఆశించిన స్థాయిలో జరగడం లేదు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వెనకాల ట్యాంకు పిల్లర్ల దశలోనే ఉంది. పల్లిపాడు, సంతబజార్‌ ప్రాంతాల్లో 900 కిలోలీటర్ల సామర్థ్యం కలిగిన ట్యాంకులతో పాటు క్యాంపు కార్యాలయం వద్ద 700 కిలోలీటర్ల సామర్థ్యం ట్యాంకు నిర్మాణం పూర్తయితేనే తాగునీటి సరఫరా సాఫీగా సాగనుంది.

వైరా రిజర్వాయర్‌ నుంచి నిత్యం 10 కోట్ల లీటర్ల నీటిని జిల్లాలోని 11 మండలాల్లో 465 గ్రామాలకు మిషన్‌ భగీరథ పథకం ద్వారా సరఫరా చేస్తున్నారు. రిజర్వాయర్‌లో ప్రస్తుతం 16.2 అడుగుల మేర మాత్రమే నీరు ఉంది. రోజుకు 37 క్యూసెక్కుల మేర నీరు ఆవిరి రూపంలో పోతుండగా.. మరో 37 క్యూసెక్కులను తాగునీటి అవసరాలకు వినియోగిస్తున్నారు. ఇదిలాగే కొనసాగితే నవంబర్‌ ఆఖరు నాటికి రిజర్వాయర్‌లో నీటిమట్టం 14 అడుగులకు పడిపోయే అవకాశముంది. మరోపక్క కుడి, ఎడమ కాల్వల ద్వారా రిజర్వాయర్‌ ఆయకట్టు కింద సాగు చేసిన వరికి నీరు సరఫరా చేస్తున్నారు. సాగు అవసరాలకు డిసెంబర్‌ వరకు విడుదల చేయక తప్పని పరిస్థితి నెలకొంది. రిజర్వాయర్‌ నీటిని సాగు, తాగు అవసరాలకు పొదుపుగా వాడుకోకపోతే రానున్న కాలంలో ఇబ్బందులు తప్పేలా లేదు.

మున్సిపాలిటీ వార్డులు జనాభా

వైరా 20 36,500

సత్తుపల్లి 23 45,000

మధిర 22 42,000

ముంచుకొస్తున్న తాగునీటి కష్టాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement