పత్తి.. ప్రైవేట్‌లోనే మొగ్గు! | - | Sakshi
Sakshi News home page

పత్తి.. ప్రైవేట్‌లోనే మొగ్గు!

Oct 23 2026 12:21 AM | Updated on Oct 23 2026 12:21 AM

● ఎంఎస్‌పీని మించి బయటే అధిక ధర ● సీసీఐ కేంద్రాల వైపు ఇప్పటివరకూ కన్నెత్తి చూడని రైతులు

● ఎంఎస్‌పీని మించి బయటే అధిక ధర ● సీసీఐ కేంద్రాల వైపు ఇప్పటివరకూ కన్నెత్తి చూడని రైతులు

ఖమ్మంవ్యవసాయం: ఇప్పుడిప్పుడే చేతికి వస్తున్న పత్తి పంటను రైతులు ప్రైవేట్‌ వ్యాపారులకు అమ్మేందుకే మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ) కంటే బహిరంగ మార్కెట్‌లో మరింత ఎక్కువగా పలుకుతోంది. దీంతో రైతులెవరూ సీసీఐ కేంద్రాల వైపు చూడడం లేదు.

ఖమ్మంలో క్వింటాకు రూ.9,200

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో పత్తి క్వింటా ధర పది రోజుల క్రితం వరకు రూ.8,400 ఉండగా.. క్రమంగా పెరుగుతూ గురువారం గరిష్టంగా రూ.9,200 నమోదైంది. మోడల్‌ ధర రూ.9,100, కనిష్ట ధర రూ.8,500 నమోదైంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర రూ.8,667 కాగా, అంతకు మించి ధర ఉంటోంది. ఎల్‌నినో కారణంగా పత్తి సాగు విస్తీర్ణం, దిగుబడి 15–20 శాతం తగ్గడమే కాక కాటన్‌ బేళ్లు, సీడ్‌, ఆయిల్‌ ధరలు అంతర్జాతీయంగా పెరగడంతో వ్యాపారులు పోటీపడి ధర పెంచుతున్నట్టు తెలుస్తోంది.

జిన్నింగ్‌ మిల్లుల్లో సీసీఐ కేంద్రాలు

ఉమ్మడి జిల్లాలోని తొమ్మిది వ్యవసాయ మార్కెట్ల పరిధిలో 15 జిన్నింగ్‌ మిల్లులను సీసీఐ కొనుగోలు కేంద్రాలుగా గుర్తించింది. ఇందులో ఖమ్మం జిల్లాలో తొమ్మిది, భద్రాద్రి జిల్లాలో ఆరు కేంధ్రాలు ఉండగా, రైతులు కపాస్‌ కిసాన్‌ యాప్‌ ద్వారా స్లాట్‌ బుక్‌ చేసుకుంటే నిబంధనల మేరకు కొనుగోళ్లకు సీసీఐ సిద్ధమైంది. కానీ ప్రైవేట్‌ మార్కెట్‌లో ధర ఎక్కువగా ఉండడంతో రైతులెవరూ రావడం లేదు. దీనికి తోడు ప్రస్తుత ఉష్ణోగ్రతల కారణంగా పత్తిలో తేమ తగ్గడంతో ప్రైవేట్‌ మార్కెట్‌లో మంచి ధర నమోదవుతోంది. కాగా, రైతులు పత్తి తీసుకొస్తే కొనడానికి సిద్ధంగా ఉన్నామని జిల్లా మార్కెటింగ్‌ శాఖ అధికారి రత్నం సంతోష్‌కుమార్‌ గురువారం ‘సాక్షి’కి వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement