రోదించిన చిన్నారులు
శ్రీదేవీ శరన్నవరాత్రుల సందర్భంగా పూజలు అందుకున్న దుర్గామాత
విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు చెరువు వద్దకు తీసుకెళ్లగా ‘నిమజ్జనం చేయొద్దు.. మళ్లీ పూజలు చేద్దాం’
అంటూ ఇద్దరు చిన్నారులు రోదించారు. కూసుమంచిలో గౌడ కులస్తుల ఆధ్వర్యాన ప్రతిష్ఠించిన అమ్మ వారిని విగ్రహాన్ని గురువారం రాత్రి గంగాదేవి చెరువులో నిమజ్జనం చేసేందుకు
ఊరేగింపుగా తీసుకెళ్లారు. అక్కడ
నిమజ్జనానికి సిద్ధమవుతుండగా
అక్కాచెల్లెళ్లయిన మందా పూజశ్రీ, చిన్ని బోరున విలపించసాగారు. ఎందుకు ఏడుస్తున్నారని స్థానికులు ఆరా తీస్తే
‘అమ్మ వారికి నిమజ్జనం చేయొద్దు’ అని కోరారు. దీంతో పిల్లల
బంధువులు, స్థానికులు నచ్చచెప్పి వారిని తీసుకెళ్లారు. – కూసుమంచి


