● యాసంగి సీజన్‌పై ప్రత్యేక కార్యక్రమం ● వచ్చేనెల 30వ తేదీ వరకు 150 అవగాహన సదస్సులు
ఖమ్మంవ్యవసాయం: కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఖేత్ బచావో అభియాన్ – రబీ’ కార్యక్రమం గురువారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో భాగంగా వచ్చేనెల 30వ తేదీ వరకు జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యాన నేల సంరక్షణే ప్రధాన అంశంగా 150 ప్రత్యేక అవగాహన సమావేశాలు నిర్వహిస్తారు. ‘మట్టిని రక్షించండి, వ్యవసాయాన్ని రక్షించండి, రైతులను రక్షించండి’ నినాదంతో వ్యవసాయ శాఖ అధికారులు, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తల బృందాలు రైతు వేదికలు, క్షేత్రాల్లో ప్రదర్శనలు నిర్వహిస్తారు.
భూసార పరీక్షలే ప్రామాణికం
రసాయన ఎరువులను విచక్షణారహితంగా వాడడం వల్ల జిల్లాలోని వరి, మిర్చి, పత్తి భూముల్లో సారం తగ్గుతోంది. ఈమేరకు సాయిల్ హెల్త్ కార్డుల ఆధారంగా ఎరువులు ఉపయోగించాలని రైతులకు సూచిస్తారు. అలాగే, గ్రీన్ అమ్మోనియా, జీవ ఎరువుల వాడకంపై శిక్షణ ఇస్తారు. అంతేకాక వరి కోత తర్వాత ఖాళీగా ఉండే పొలాల్లో అపరాలు, నూనె గింజల పంటలు సాగు చేయడం వల్ల లాభాలను వివరిస్తారు. పెసర, మినుము, శనగ, ఆవాలు, నువ్వులు, వేరుశనగ వంటి పంటల సాగును ప్రోత్సహించడంతో పాటు అంతర పంటల విధానంపై అవగాహన కల్పిస్తారు.
వ్యర్థాల దహనం వద్దు
వరి కోత తర్వాత కొయ్యకాలు, వ్యర్థాలను కాల్చడం వల్ల భూసారం దెబ్బతినడమే కాకుండా వాతావరణ కాలుష్యం పెరుగుతోంది. వీటిని కాల్చకుండా వర్మీ కంపోస్టుగా, పశుగ్రాసంగా, సేంద్రియ ఎరువుగా మార్చుకునే విధానాలపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తారు. అలాగే, పచ్చిరొట్ట ఎరువులు, జీవ ఎరువులు, వర్మీ కంపోస్టింగ్, ప్రకతి వ్యవసాయ పద్ధతులు, సమగ్ర సస్యరక్షణపై శిక్షణ ఇవ్వనున్నారు. ఇంకా నీటి సంరక్షణ, వర్షపు నీటి సేకరణ, భూగర్భ జలాల పునరుద్ధరణతో పాటు బిందు, తుంపర సేద్యం ప్రాముఖ్యతను వివరిస్తారు. అలాగే, నకిలీ విత్తనాలు, కల్తీ ఎరువులు, నాసిరకం పురుగు మందుల గుర్తించి, వీటితో మోసపోతే ఫిర్యాదు విధానాలపై చైతన్యం కల్పిస్తారు. ఇంకా పీఎం–కిసాన్, పీఎం ఫసల్ బీమా యోజన, కిసాన్ క్రెడిట్ కార్డు, పీఎం ధన్–ధాన్య కషి యోజన వంటి పథకాలతో జరిగే లబ్ధిని వివరిస్తారు. ‘ఖేత్ బచావో అభియాన్’ ద్వారా 40 రోజుల పాటు సాగే సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకుని శాసీ్త్రయ సాగు వైపు అడుగులు వేయాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి డి.పుల్లయ్య కోరారు.


